Site icon HashtagU Telugu

Talliki Vandanam : తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చెయ్యలేదు : ఏపీ ప్రభుత్వం

guidelines-for-talliki-vandanam-scheme

talliki-vandanam-scheme

Talliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం పై ఏపి ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పథకాన్ని ఉద్దేశించి.. ప్రతి విద్యార్థి తల్లికీ సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఇస్తామని అన్నారు. కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే, అంతమందికీ ఇస్తామని అన్నారు కదా. ఐతే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఏ గైడ్‌లైన్సూ విడుదల చెయ్యలేదు. కానీ విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటి అసత్యాలు నమ్మొద్దని చెబుతూ.. ఏపీ ప్రభుత్వం అధికారిక అలర్ట్ జారీ చేసింది.తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చెయ్యలేదు. ఈ పథకం కింద రూ.15,000 రావాలంటే ఇవే మార్గదర్శకాలు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాన్ని నమ్మవద్దు అని ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన తర్వాత అధికారికంగా విడుదల చేస్తామినీ, అప్పటివరకు ఎవరు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని విద్యాశాఖ సూచించింది.

చూశారా.. ప్రభుత్వం అలర్ట్ అయ్యి.. ప్రజలకు ఈ ప్రకటన చేసింది కాబట్టి.. ప్రజలు కూడా జాగ్రత్తపడతారు. లేదంటే.. ఆ అసత్య ప్రచారమే నిజం అనుకునేవారు. సోషల్ మీడియాలో ఆకతాయిలు చేసే పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి ప్రచారాలు చేసేవారిని కనిపెట్టడం చాలా తేలిక. ఐపీ అడ్రెస్ ద్వారా ఇట్టే పట్టుకోవచ్చు. వాళ్లను పట్టుకొని, చట్టపరంగా చర్యలు తీసుకోవడం మేలు. తద్వారా.. మిగతా వాళ్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెయ్యకుండా ఉంటారు.

Read Also: YS Sharmila : బీజేపీ తొత్తు పార్టీ.. తోక పార్టీ వైసీపీ – వైఎస్ షర్మిల