Site icon HashtagU Telugu

Task Force : జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

Jangareddy Gudem Adulterate

Jangareddy Gudem Adulterate

ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం(Jangareddygudem)లో 2022 మార్చిలో జరిగిన కల్తీ మద్యం (Adulterated liquor) విషాద ఘటన పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో 20 మంది బలైన నేపథ్యంలో ప్రభుత్వ పర్యవేక్షణలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయడం, కారణాలను తెలుసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా నివారించడం లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Snoring Husbands: గురక పెట్టే భర్తలపై ‘పూరి మ్యూజింగ్స్‌’.. స్లీప్‌ డివోర్స్‌‌ సీక్రెట్స్ ఇవిగో

ఈ టాస్క్ ఫోర్స్‌కు ఏలూరు జిల్లా పోలీసు అధికారి (SP) కిశోర్ నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్ మరియు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు అధికారుల బృందం కల్తీ మద్యం తయారీ, పంపిణీ, ఆమోదిత దారులు, దాని వలన జరిగిన మానవ నష్టంపై లోతైన విచారణ జరిపి నివేదికను సమర్పించనున్నారు.

ఈ చర్యతో కల్తీ మద్యం తయారీదారులకు గట్టి హెచ్చరికగా మారనుంది. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా, పరిపాలనా విధానాల్లో మార్పులు తీసుకురావడానికి ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది. బాధితులకు న్యాయం చేయడంతో పాటు మద్యం నియంత్రణ శాఖ పనితీరును సమీక్షించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య పాత్ర పోషించనుంది.