Target CBN : చంద్ర‌బాబు టార్గెట్ గా `GVL` వాయిస్! BRS,YCP కి పరోక్ష మేలు!

జీవీఎల్ తొలి నుంచి చంద్ర‌బాబుకు (Target CBN) రాజ‌కీయంగా వ్య‌తిరేకం. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 12:04 PM IST

రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ తొలి నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు (Target CBN) రాజ‌కీయంగా వ్య‌తిరేకం. 2019 ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డిన తొలి బీజేపీ లీడ‌ర్(GVL) ఆయ‌న‌. గ‌త ఐదేళ్లుగా మాత్ర‌మే రాజ‌కీయ తెర‌మీద క‌నిపిస్తోన్న జీవీఎల్ న‌ర‌సింహారావు స్వ‌త‌హాగా సామాజిక శాస్త్ర‌వేత్త‌. అంతేకాదు, రాజ‌కీయ ప‌రిణామాల మీద అధ్య‌య‌నం చేసే పండితుడు. ఏపీ బీజేపీ లీడ‌ర్ గా గ‌త ఐదేళ్లుగా ఫోక‌స్ అవుతున్నారు. ఢిల్లీ పెద్ద‌ల‌తో ఉన్న స‌త్సంబంధాల కార‌ణంగా ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ద‌క్కింది. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని ఎత్తుగ‌డ వేశారు. ఆ క్ర‌మంలో రాజ్య‌స‌భ వేదిక‌గా ఏపీ అభివృద్ది మీద కాకుండా రాజ‌కీయ ప‌రిణామాల‌ను మార్చేందుకు అనువైన ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తున్నారు.

జీవీఎల్ తొలి నుంచి చంద్ర‌బాబుకు వ్య‌తిరేకం(Target CBN) 

ఢిల్లీ వేదిక‌గా మీడియాను కాపుల వైపు మ‌ళ్లించ‌డానికి ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్న‌వేసిన ఆయ‌న(GVL) ఇప్పుడు వంగ‌వీటి రంగా గురించి స్తుతించ‌డం మొద‌లు పెట్టారు. కృష్ణా జిల్లాకు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. రాజ్యసభలో ఆ డిమాండ్ ను కేంద్రంముందుంచారు.అంతేకాదు, విజయవాడ విమానాశ్రయానికి కూడా వంగవీటి రంగా పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వంగవీటి మోహనరంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను రాజ్య‌స‌భ వేదిక‌గా ఆయ‌న డిమాండ్ చేశారు.

Also Read : GVL: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని నేను భావించడం లేదు: జీవీఎల్ నరసింహారావు

ఏపీ బీజేపీ త‌ర‌పున రాజ్య‌స‌భ స‌భ్యుడుగా ఎంపికైన జీవీఎల్ (GVL) రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడూ పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌శ్న‌లు సంధించిన పాపాన పోలేదు. కానీ, ఇప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్లు, వంగ‌వీటి రంగా పేరు కృష్ణా జిల్లాకు పెట్టాల‌ని డిమాండ్ చేస్తూ ఒక సామాజిక‌వ‌ర్గం ప‌క్షాన నిలుస్తున్నారు. స్వ‌త‌హాగా రాజ‌కీయ అధ్య‌య‌న‌వేత్త అయిన జీవీఎల్ ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పడానికి కాపు సామాజిక‌వ‌ర్గంపై ప్రేమ కురిపించ‌డం రాజ్య‌స‌భ వేదిక‌గా ఆయ‌న వేసిన ప్ర‌శ్న‌ల ఆధారంగా అర్థ‌మ‌వుతోంది. ప‌రోక్షంగా వైసీపీకి మేలు చేకూరేలా ఆయ‌న వాయిస్ వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో టీడీపీని(Target CBN) ఇరుకున పెట్టేలా మాస్ట‌ర్ స్కెచ్ వేశారు.

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్లలో 5శాతం కాపుల‌కు..

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్లలో 5శాతం కాపుల‌కు ఇస్తాన‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు అసెంబ్లీ వేదిక‌గా బిల్లు పాస్ చేశారు. అది, రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో బాగా(Target CBN) న‌ష్టం చేసింది. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు వైసీపీ వైపు వెళ్లిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి టీడీపీ వైపు ఆలోచిస్తున్నాయ‌ని స‌ర్వేల ద్వారా బ‌య‌ట‌ప‌డుతోంది. అందుకే, జీవీఎల్(GVL) వ్యూహాత్మ‌కంగా పార్ల‌మెంట్ వేదిక‌గా, మీడియాముఖంగా కాపు కార్డ్ ను బాగా ప్లే చేస్తూ ప‌రోక్షంగా వైసీపీకి మేలు చేకూర్చుతున్నార‌ని టాక్‌. ఆ క్ర‌మంలోనే కృష్ణా జిల్లాకు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌నే డిమాండ్ ను తీసుకొచ్చార‌ట‌. అంతేకాదు, ఇదే ఈక్వేష‌న్ తో కేసీఆర్ కూడా వెళుతున్నారు. ఇటీవ‌ల ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా తోట చంద్ర‌శేఖ‌ర్ ను నియ‌మించారు. కాపు ఓట్ల‌ను చీల్చ‌డానికి కేసీఆర్ ఒక యాంగిల్ ను ఎంచుకుంటే, బీసీల‌ను టీడీపీకి దూరంగా చేయ‌డానికి జీవీఎల్ మ‌రో కోణాన్ని ఎంచుకున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట‌.

Also Read : BJP Ridings: ప్రాంతీయ పార్టీలపై బీజేపీ సవారీ! కేసీఆర్ జాతీయ కుప్పిగంతులు

ఏపీలో బీజేపీ, వైసీపీ పార్టీల‌ను వేర్వేరుగా చూడ‌లేం. ఆ రెండు పార్టీలు తెర వెనుక క‌లిసి ప‌నిచేస్తున్నాయి. ఏపీ సీఎంగా జ‌గన్మోహ‌న్ రెడ్డి బాధ్య‌తల‌ను స్వీక‌రించిన తొలి రోజుల్లోనే బీజేపీ పెద్ద‌ల‌కు తెలియ‌కుండా ఏ నిర్ణ‌యం తీసుకోమ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి, త‌న‌కు మ‌ధ్య రాజ‌కీయేత‌ర బంధాలు ఉన్నాయ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల విశాఖ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అన్న‌ద‌మ్ముల బంధంగా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పుకున్నారు. వీళ్ల బంధాల‌న్నీ క‌లిపితే బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల‌ను వేర్వేరుగా చూడ‌లేమ‌ని ఎవ‌రైనా చెబుతారు. అందుకే బ‌ల‌మైన ప్రత్య‌ర్థిగా ఉన్న చంద్ర‌బాబునాయుడును(Target CBN) దెబ్బ‌తీయ‌డానికి పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట ప‌లు ర‌కాల గేమ్స్ కు తెర‌లేచింది.