Site icon HashtagU Telugu

Taraka Ratna’s Wife : జగన్ కు భారీ షాక్ ఇచ్చిన తారకరత్న భార్య అలేఖ్య

Taraka Ratna Wife Vijay Sai

Taraka Ratna Wife Vijay Sai

జగన్, విజయసాయిరెడ్డి (Jagan -Vijayasai Reddy) మధ్య పెరిగిన దూరం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తన అత్యంత విశ్వసనీయుడిగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డిని, వైఎస్ జగన్ కోర్ టీమ్ నుంచి క్రమంగా తొలగించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పై జగన్ విమర్శలు గుప్పించటం, పార్టీ అంతర్గత రాజకీయాల్లో భారీ కలకలం రేపింది. “చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తి” అని విజయసాయిరెడ్డి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య(Taraka Ratna’s wife Alekhya Reddy), తన బాబాయ్ విజయసాయిరెడ్డికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. “నిజం నిశ్శబ్దంగా బలంగా ఉంటుంది,తప్పుడు కథనాల మధ్యలో గౌరవం నిలుస్తుంది” వంటి పదాలు రాజకీయ పరిణామాలకు లోతైన అర్థం పంచుతున్నట్లు కనిపిస్తోంది. అలేఖ్య విజయసాయిరెడ్డితో తన అనుబంధాన్ని స్పష్టంగా వెల్లడించడం, జగన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెబుతూ వ్యవసాయం చేసుకుంటున్నానని ప్రకటించినప్పటికీ, పార్టీ లోపలి వ్యవహారాలను బయటపెట్టిన సందర్భంలో ఆయన మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ లోని అంతర్గత విభేదాలు వెల్లడించడంతో పార్టీపై ప్రజల దృష్టి మరలింది. అలేఖ్య మద్దతు, జగన్ విమర్శలు, విజయసాయి మౌనం .. ఇవన్నీ కలిపి వైసీపీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు కలిగిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇది పార్టీలో విభజనకు సంకేతమా? లేక వ్యక్తిగత స్థాయిలో ఎదురుదెబ్బల పరంపరకు సంకేతమా? అన్నదానిపై చర్చ కొనసాగుతోంది.