Taraka Ratna : తార‌క ర‌త్న‌కు `ఎక్మో`, ఎలాంటి ప‌రిస్థితుల్లో `ఎక్మో` వాడ‌తారు..

నారాయ‌ణ హృదాల‌యంలో నంద‌మూరి తార‌ర‌త్నకు(Taraka Ratna) అత్యాధునికి చికిత్స‌ను అందిస్తున్నారు.

  • Written By:
  • Updated On - January 28, 2023 / 01:53 PM IST

ప్ర‌స్తుతం నారాయ‌ణ హృదాల‌యంలో నంద‌మూరి తార‌ర‌త్నకు(Taraka Ratna) అత్యాధునికి చికిత్స‌ను అందిస్తున్నారు. కొద్దిసేప‌టి క్రితం ఎక్మో చేసిన‌ట్టు వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఆయ‌న ఆరోగ్యం కుద‌ట‌ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. అస‌లు వైద్యులు చేసిన ఎక్మో (ECMO) అంటే ఏమిటి? ఎవ‌రికి చేస్తారు? ఎలాంటి ప‌రిస్థితుల్లో చేయాల్సి వ‌స్తుంది? అనే అంశాల‌ను ప‌రిశీలిస్తే, వైద్యులు అందిస్తోన్న స‌మాచారం ప్ర‌కారం సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఇలాంటి ప‌ద్ద‌తిని చికిత్స కోసం వైద్యులు ఎంచుకుంటారు.

నారాయ‌ణ హృదాల‌యంలో నంద‌మూరి తార‌ర‌త్నకు(Taraka Ratna)

గుండె, కాలేయం, ఉప‌రితిత్తుల స‌మ‌స్య కార‌ణంగా తీవ్ర బాధను అనుభ‌విస్తున్న వాళ్ల‌కు ఎక్మో(ECMO) అనే టెక్నాలజీ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ పద్ధతిలో శరీరం నుండి బ్లడ్ తీసుకుని ఒక మెషీన్ సహాయంతో రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్‌ని రిమూవ్ చేసి ఆర్టిఫిషియల్ ఆక్సిజనేషన్ చేస్తారు. ప్రస్తుతం, కొవిడ్ 19 కార‌ణంగా న్యుమోనియాతో బాధ పడుతూ, బ్లడ్ ఆక్సిజెన్ లెవెల్స్ ని అదుపు చేయ‌డానికి వెంటిలేషన్ సరిపోని రోగుల‌కు వాడుతున్నారు. ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (ఇఎల్ఎస్ఒ) అనేది ఒక ఇంటర్నేషనల్ కన్సార్టియం. ఇందులో పని చేయని అవయవాలకి సపోర్ట్ ఇచ్చే ఎక్మో లాంటి థెరపీల డెవలప్మెంట్, టెస్టింగ్ కి నిష్ణాతులైన‌ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, సైంటిస్ట్స్ ఉంటారు. ఇతర పద్ధతులు పని చేయని కొవిడ్ 19 పేషెంట్స్ విషయంలో కూడా ఎక్మో వాడకం ద్వారా సుమారు 55% కోలుకున్నారు.

ఎక్మో ఎలా వాడతారు

ఎక్మో లో రెండు రకాలున్నాయి. వీనో వీనస్ అంటే లంగ్స్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వీనో ఆర్టీరియల్ అంటే లంగ్స్, హార్ట్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఎక్మో సర్క్యూట్ ని పేషెంట్‌కి కనెక్ట్ చేయడానికి ఒకటి నుండి మూడు కాన్యులాల వరకూ యూజ్ చేస్తారు. సాధారణంగా పేషెంట్ కుడి మెడ మీద సర్జన్ చిన్న కోత పెడతారు. అందులో నుండి ఒక ట్యూబ్ ని జగులర్ వెయిన్ లోకి పంపిస్తారు. ఒక్కోసారి అదే కోత ద్వారా రెండవ ట్యూబ్ కూడా పంపిస్తారు. ఇది కరోటిడ్ ఆర్టరీ లోకి వెళ్తుంది. ఈ ట్యూబ్స్ ని ఒక మెషీన్ కి కనెక్ట్ చేస్తారు. ఆ మెషీన్ బ్లడ్ ని ఆక్సిజనేట్ చేస్తుంది. ఒక్కోసారి, ఈ ట్యూబ్స్ ని డైరెక్ట్ గా ఏట్రియం లోకి కానీ అయోర్టా లోకి కానీ పంపిస్తారు.

Also Read : Tarakaratna: తారకరత్న శరీరం రంగు నీలి రంగులోకి ఎందుకు మారిందంటే?

ఎక్మోని మొట్టమొదటి సారి ఎడ్మినిస్టర్ చేసినప్పుడు పేషెంట్ కి మత్తు ఇచ్చి, ప్యారలైజ్ చేస్తారు. కానీ, ఎక్మో యొక్క లక్ష్యాల్లో ఒకటి ఏమిటంటే పేషెంట్స్ స్టెబిలైజ్ అయిన తరువాత వారిని మత్తులో నుండి లేపి వాళ్ల‌కై వాళ్లు జాగ్ర‌త్త‌గా ఉండేలా చేస్తారు. దీనికి ఎన్నో రిసోర్సులు కావాలి. అందుకే, అన్ని చోట్లా ఇది వాడడం కుదరకపోవచ్చు. మామూలు పరిస్థితుల్లో ఎక్మో వాడిన తరువాత పేషెంట్స్ లేచి ఈ ఆర్టిఫిషియల్ లంగ్ సహాయంతో నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్మో వాడకం లో ఒక గోల్ ఏమిటంటే పేషెంట్ తనకు తాను పాలు పంచుకోవడం. అంటే పేషెంట్ యాక్టివ్ గా ఉండడం, తన మెడికేషన్ గురించి తను తెలుసుకునే పరిస్థితి ఉండడం.

ఎక్మో ఈజీ కాదు..

ఎక్మో వాడకం లో ఉన్న పెద్ద సమస్య దానికి కావాల్సిన రిసోర్సులే. ఈ ఎక్విప్మెంట్ వాడకం గురించి ఒక హాస్పిటల్ లో ఒక టీం కి ట్రెయినింగ్ ఇవ్వటానికి కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. అందుకే కొత్త సెంటర్స్ లో ఎక్మో ఫెసిలిటీ అందుబాటులోకి తేవడం కన్నా ఉన్న సెంటర్ లో కెపాసిటీ పెంచడం మంచిదని ఎల్సో భావిస్తోంది. ఉదాహరణకి, ఒక సెంటర్ లో ఒక సారి పదిమంది పేషెంట్స్ కి ఈ ప్రొసీజర్ నిర్వహించగలిగితే, ఇంకా ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఒకే సారి 20, 30 మంది పేషెంట్స్ కి ఈ ప్రొసీజర్ నిర్వహించవచ్చు. అలాగే, ప్రతి కొవిడ్ 19 పేషెంట్ కీ ఎక్మో వాడడం తగినది కాకపోవచ్చు. ప్రత్యేకించి ఆ పేషెంట్ పెద్దవారైనా, క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఏవైనా ఉన్నా ఎక్మో వాడకం సరైనది కాకపోవచ్చు. ఎక్మో అవసర పడని కేసులు కూడా ఎన్నో ఉంటాయి. బాగా ఒబీస్ గా ఉండి, క్రానిక్ డయాబెటీస్, హైబీపీ ఉన్న 75 సంవత్సరాల పేషెంట్ కంటే కూడా ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేని 40 సంవత్సరాల పేషెంట్ కి ఎక్మో ఉపయోగపడుతుంది.

Also Read : Taraka Ratna : మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు ఆసుప‌త్రికి తార‌క‌ర‌త్న

ఎక్మో కేవలం కొవిడ్ 19 పేషెంట్స్ కి మాత్రమే ప్రత్యేకించబడినదేమీ కాదు, కొన్ని దశాబ్దాల నుండీ లంగ్ ఫెయిల్యూర్ కేసుల్లో ఎక్మో వాడుతూనే ఉన్నారు. మొదట్లో ఈ టెక్నాలజీని చిన్న పిల్లలకి మాత్రమే వాడేవారు. సుమారుగా పది సంవత్సరాల నుండే పెద్ద వాళ్ళకి కూడా దీన్ని వాడుతున్నారు. ముప్ఫై సంవత్సరాలుగా చిన్న పిల్లలకి వాడిన దాని కంటే కూడా పదేళ్ళలో పెద్ద వాళ్ళకి దీన్ని ఎక్కువగా వాడారు. కొవిడ్ 19 పేషెంట్స్ కి ఎక్మో ని మిరాకిల్ క్యూర్ గా అనుకోకూడదు. వెంటిలేషన్ ఫెయిల్ అయినా కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయనే భరోసా, అంతే. అంటే, తార‌క ర‌త్న(Tarak Ratna)ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా ఉంద‌ని బావించాల్సి ఉంటుంది. కోలుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ, మిగిలిన ఆర్గాన్స్ ఎక్మోకు స‌పోర్ట్ చేయాల్సి ఉంటుంది.