Taraka Ratna : తార‌క‌ర‌త్నతో బాల‌య్య‌, బెంగుళూరుకు చంద్ర‌బాబు, జూనియ‌ర్?

నందమూరి, నారా అభిమానుల‌ ఉత్సాహం ఉద్విగ్నంగా మారింది. నంద‌మూరి తార‌క ర‌త్న(Taraka Ratna) స్పృహ‌త‌ప్పి ప‌డిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 02:31 PM IST

నందమూరి, నారా అభిమానుల‌ ఉత్సాహం ఉద్విగ్నంగా మారింది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నారా లోకేష్ పాద‌యాత్ర తొలి రోజే నంద‌మూరి తార‌క ర‌త్న(Taraka Ratna) స్పృహ‌త‌ప్పి ప‌డిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఎప్పుడూ హుషారుగా ఉండే తార‌క‌ర‌త్న పాద‌యాత్రలోనూ తొలి రోజు లోకేష్ ను కొద్దిసేపు అనుసరించారు. కిక్కిరిసిన అభిమానుల న‌డుమ ఆయ‌న కూడా అడుగులో అడుగు వేస్తూ అభిమానుల‌ను ఉత్సాహ ప‌రిచారు. అక‌స్మాత్తుగా ఆయ‌న కింద‌ప‌డిపోవ‌డంతో హీరో బాల‌య్య ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కుప్పం స‌మీపంలోని నారాయ‌ణ హృద‌యాలయంకు త‌ర‌లించి చికిత్స‌ను అందిస్తున్నారు. ఒక వైపు చంద్ర‌బాబు(CBN) ఇంకో వైపు బాల‌య్య ఎప్ప‌టిక‌ప్పుడు తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

తార‌క‌ర‌త్న‌కు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో..(Taraka Ratna)

యువ‌గ‌ళం పాద‌యాత్ర తొలి రోజు నందమూరి తారకరత్న (Taraka Ratna) గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పంలోని పేస్ వైద్య కళాశాలలో చికిత్సను ప్రారంభించి, యాంజియోగ్రామ్ నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శుక్ర‌వారం అర్ధరాత్రి బెంగళూరుకు తరలించారు. బెంగళూరు నుంచి వచ్చిన రెండు ప్రత్యేక అంబులెన్సుల ద్వారా ఆధునిక వైద్య పరికరాల సపోర్టుతో బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అంబులెన్సులతో పాటు బాలకృష్ణ కూడా బెంగళూరుకు వెళ్లారు. ప్రస్తుతం తార‌క‌ర‌త్న‌కు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న భార్య, కుమార్తెలు ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రిలోనే ఉన్నారు. మరోవైపు తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు(CBN), జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరు బ‌యలుదేరి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : Taraka Ratna : తార‌క ర‌త్న‌కు `ఎక్మో`, ఎలాంటి ప‌రిస్థితుల్లో `ఎక్మో` వాడ‌తారు..

తాజాగా విడుద‌ల చేసిన వైద్యుల బులెటిన్ ప్ర‌కారం తార‌క‌ర‌త్న ఆరోగ్యం సంక్లిష్టంగా ఉంది. నంద‌మూరి కుటుంబం ప‌రిస్థితిని స‌మీక్షిస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు సోద‌రుని ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ఆయ‌న ఆస్ప‌త్రికి బ‌య‌లుదేరి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఇంకో వైపు చంద్ర‌బాబునాయుడు కూడా ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు వెళ్లారు. నంద‌మూరి, నారా కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. పాద‌యాత్ర‌లో ఉన్న లోకేష్ ప‌రామ‌ర్శించడానికి తార‌క‌ర‌త్న ఉన్న ఆస్ప‌త్రికి శుక్ర‌వారం రాత్రి వెళ్లారు. తార‌క‌ర‌త్న‌కు ప్రాణాపాయంలేద‌ని తెలుసుకున్న లోకేష్ రెండో రోజు పాద‌యాత్ర‌కు బ‌య‌లు దేరారు.

జూనియర్ ఎన్టీఆర్ బెంగుళూరు బ‌యలుదేరి….

తొలి రోజున యువ‌గ‌ళం యాత్ర‌కు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. రెండో రోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలు పేస్ వైద్య కళాశాల నుంచి పాదయాత్ర మొదలయింది. బెగ్గిలిపల్లె, కడపల్లె, కలమలదొడ్డి మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. కలమలదొడ్డి వద్ద మధ్యాహ్న భోజన విరామం షెడ్యూల్ అయింది. భోజనాల అనంతరం అక్క‌డ నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం శాంతిపురం క్యాంపు వద్ద సైట్ ఇంటరాక్షన్ ఉంటుంది. తుమ్మిశి చెరురు సమీపంలోని పలమనేరు – కుప్పం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి బస చేస్తారు.

Also Read : Taraka Ratna : మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు ఆసుప‌త్రికి తార‌క‌ర‌త్న

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న లోకేష్ ఎప్ప‌టికప్పుడు తార‌క‌ర‌త్న ఆరోగ్యాన్ని తెలుసుకుంటున్నారు. శుక్ర‌వారం రాత్రి తార‌క‌ర‌త్నం స‌తీమ‌ణి, ఇత‌ర కుటుంబ స‌భ్యులు నారాయ‌ణహృదాయ‌లం ఆస్ప‌త్రికి వెళ్లారు. ఎయిర్ లిఫ్ట్ చేయ‌డం ద్వారా మెరుగైన చికిత్స కోసం తార‌క‌ర‌త్న‌ను బెంగుళూరు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఎక్మో ఉప‌యోగించ‌డం ద్వారా తార‌క ర‌త్నకు వైద్యులు చికిత్స‌ను అందిస్తున్నారు.