Taneti Vanitha: మహిళల భద్రతకు సీఎం జగన్ పెద్దపీట!

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న చింతన్ శివిర్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు హోంమంత్రి తానేటి వనిత వివరించారు.

Published By: HashtagU Telugu Desk
Taneti Vanitha AP home Minister

Taneti Vanitha AP home Minister

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న చింతన్ శివిర్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు హోంమంత్రి తానేటి వనిత వివరించారు. అక్రమ మాదక ద్రవ్యాల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని, గంజాయి సాగుపై వైస్సార్సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అని అన్నారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని, ఇప్పటి వరకు 9251 కోట్ల విలువ చేసే గంజాయిని నాశనం చేశామని అన్నారు. గంజాయిని నిలువరించడంలో ఏపీ ముందంజలో ఉందని, ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 11,100 మందిని అరెస్ట్ చేయడం చేశామని హోం మినిస్టర్ అన్నారు. ఏపీలో మహిళల భద్రతకు సీఎం జగన్ గారు పెద్దపీట వేశారని, ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెండ్లి పోలీసింగ్ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తోందని తానేటి వనిత వెల్లడించారు.

మహిళల భద్రత కోసం దిశ యాప్ ను తీసుకువచ్చామని, దిశ యాప్ ను ఉపయోగించి అనేకమంది రక్షణ పొందుతున్నారని, ఏపీలో పోలీస్ వ్యవస్థ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తోందని ఆమె అన్నారు. గతంలో కేసులకు సంబంధించి 200 రోజులకు పైగా విచారణ సమయం పట్టేది అనీ, సీఎం జగన్ గారి పాలనలో 58 రోజుల్లో విచారణ పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి పాదయాత్రలో రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, హై కోర్ట్ ఆదేశాలను ఉల్లంగిస్తూ అమరావతి పాదయాత్ర చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు.

  Last Updated: 27 Oct 2022, 05:32 PM IST