Site icon HashtagU Telugu

Tammineni Sitaram: అవినాష్ అరెస్ట్ సీబీఐ చూసుకుంటుంది!

Tammineni Sitaram

New Web Story Copy 2023 05 22t111750.087

Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం నిన్న ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారులని దర్శించుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు.

తమ్మినేని సీతారాం మాట్లాడుతూ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లీన్ స్వీప్ చేసి టీడీపీ, జనసేన గూబ గుయ్యమనేలా కొడతామని అన్నారు. ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రిని పట్టుకుని ఇదేం కర్మరా బాబు అంటారా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నలకు తమ్మినేని సీరియస్ అయ్యారు. ప్రశ్నలు అడిగేముందు కనీస అవగాహన ఉండి అడగాలని సూచించారు. ఇంతకీ ఆ విలేఖరి ఏమని ప్రశ్నించాడంటే… అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా తమ్మినేని తనదైన స్టైల్ లో రిప్లయ్ ఇచ్చాడు.

అవినాష్ రెడ్డి అంశం గురించి నీకెందుకు? నువ్వేమైనా సీబీఐ చీఫ్? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి అంశం సీబీఐ చూసుకుంటుందని, దాని గురించి నీకు అవసరం లేదని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడే అర్హత నీకు గానీ, నాకు గానీ లేదన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంక్షేమ పథకాలకే వెచ్చిస్తున్నారనే ఆరోపణలపై తమ్మినేని ఘాటుగా స్పందించారు. ప్రశ్నలు అడిగేముందు మీడియా వాళ్ళకి అవగాహన ఉండాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, హార్బర్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఎలా వచ్చాయని తమ్మినేని ఎదురు ప్రశ్నించారు. అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగితే ఎలా సమాధానం చెప్పాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు తమ్మినేని.

Read More: 1 Lakh Crores : జాక్ పాట్ కొట్టిన గవర్నమెంట్ బ్యాంక్స్