Site icon HashtagU Telugu

Tammineni Sitaram : రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదు..!!

Tammineni

Tammineni

రాజధాని నిర్మాణానికి అమరావతి పనికిరాదంటూ వ్యాఖ్యానించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం. శ్రీకాకుళం రాజధాని చేయాలన్నవారిది మరుగుజ్జు మనసత్వం. రాజధాని నిర్మాణానికి అమరావతి ఏమాత్రం పనికిరాదు. అవన్నీ మెత్తటి భూములు. రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు అతి తెలివితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని రాజధాని చేయాలన్న కుట్ర చేశారన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తమ్మినేని సీతారం పాల్గొన్నారు. విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం చేసిన ఆయన హైకోర్టుకు సమర్పిస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో టీడీపీ జడ్పిటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబుపై తమ్మినేని సీతారం అసహనం వ్యక్తంచేశారు. శ్రీకాకుళాన్ని రాజధాని చేయాలని బుచ్చిబాబు కోరారు. దీనికి బదులుగా విశాఖ రాజధానికి వ్యతిరేకం అని టీడీపీ తీర్మానం చేయగలదా అంటూ ప్రశ్నించారు. ఉద్యమాల పురిటి గడ్డ శ్రీకాకళం. విశాఖ రాజధాని సాధన కోసం మరోసారి ఉద్యమాల ఖిల్లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. అమరావతి రైతుల పాదయాత్రను ఆ దేవుడు కూడా హర్షించలేదు. అందుకే వారు వెనక్కి వెళ్లారు. 20కోట్లు ఖర్చు పెడితే విశాఖ అద్భుతమైన రాజధానిగా మారుతుందని…న్యాయం చేయాలంటూ న్యాయమూర్తులకు చేతులెత్తి మొక్కుతున్నామన్నారు.