Site icon HashtagU Telugu

Pawan Kalyan : పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్ కు ‘టీడీపీ’ పెత్తనం – తమ్మారెడ్డి భరద్వాజ్

Thammareddy

Thammareddy

ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ (Tammareddy Bharadwaja) మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పలు విమర్శలు చేసారు. మొదటి నుండి వర్మ తో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ సైతం పవన్ కళ్యాణ్ , టీడీపీ లపై విమర్శలు చేస్తూ..వైసీపీ (YCP) కి సపోర్ట్ గా మాట్లాడుతూ వస్తున్నా సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏమాట్లాడిన…ఏ సభ పెట్టిన..వైసీపీ ఫై ఎలాంటి విమర్శలు చేసిన వాటికీ కౌంటర్లు, సెటైర్లు వేస్తూ వస్తున్నారు తమ్మారెడ్డి.

ప్రస్తుతం ఏపీ లో రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. బాబు అరెస్ట్ తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టీడీపీ కి సపోర్ట్ ఇవ్వడం..టీడీపీ శ్రేణుల్లో ఊపిరి పోసింది. పొత్తు ప్రకటన తర్వాత ఇరు పార్టీలు కలిసే కార్యాచరణ చేస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన పవన్ వారాహి యాత్ర కు కూడా టీడీపీ సపోర్ట్ ఇవ్వడం ..యాత్రలో పాల్గొనడం జరిగింది. పవన్ సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలను గెలిపించాలని ప్రజలను కోరుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్ కి పెత్తనం ఇచ్చారని తనకు ఓ టీడీపీ కార్యకర్త చెప్పినట్లు తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఇటీవల నన్ను ఓ టీడీపీ అభిమాని కలిశారు. చంద్రబాబు బయటకు వస్తారు. మీకు బాగా సింపతి వచ్చింది. మీకు గెలిచే అవకాశం ఉంది కదా? అని నేను అన్నాను. ఆ ప్రశ్నకు ఆ టీడీపీ అభిమాని చాలా నిరాశగా సమాధానం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అతడు చెబుతూ.. ప్రస్తుతం టీడీపీని చూస్తుంటే మాకు ఏమి అర్ధం కావడంలేదు. చంద్రబాబు అరెస్ట్.. వైసీపీ సూసైడ్ అనుకున్నాము. అలానే చంద్రబాబు జైల్లోకి వెళ్లరు.. ఒక వేళ వెళ్తే..పార్టీలోని నేతలు అందరూ కలసి వస్తారని భావించాము. అయితే మా కార్యకర్తల్లో స్పందన వచ్చింది కానీ పార్టీలో స్పందన రాలేదు. టీడీపీలోని ప్రతి నాయకుడిలో అసలు ఎమోషన్ లేదు. ఇలాంటి స్థితిలో మేము ఉంటే నేను ఉన్నానంటూ పవన్ కల్యాణ్ వచ్చారు. మొత్తం ఆయనే చూసుకుంటాను అంటున్నారు. ఆయన అంతట ఆయనే గెలవలేని వ్యక్తి , అందులోనూ టీడీపీ సపోర్టు చేస్తే తప్ప గెలవలేడు. వారాహి యాత్ర ప్రారంభానికి ముందే చంద్రబాబు నాయుడు, పవన్ మాట్లాడుకుని కలిసి యాత్ర చేసి ఉంటే బాగుండేది.

ఇప్పుడు వచ్చే సరికి టీడీపీ నాయకత్వం ఎవ్వరూ మాట్లాడటం లేదు. పేనుకు పెత్తనం ఇచ్చినట్లు పవన్ కు పెత్తనం ఇచ్చారు. మేము ప్రజల్లోకి వెళ్తే.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీకు ఏ దిక్కులేక తమ నాయకుడిని ఎన్నుకున్నట్లు ఆయ జనసేన కార్యకర్తలు కొందరు మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉందంటూ టీడీపీ అభిమాను ఆవేదన వ్యక్తం చేశాడు” అని తమ్మారెడ్డి అన్నారు. మరి నిజంగా టీడీపీ అభిమాని ఆలా అన్నాడా..లేక తమ్మారెడ్డి ఆలా చెప్పుకొచ్చాడు అనేది ఆయనకే తెలియాలి.

Read Also : Gold In Badminton : ‘ఏషియన్ గేమ్స్’లో కొత్త రికార్డు.. బ్యాడ్మింటన్ లో భారత్ కు తొలి గోల్డ్