Talk Of YCP MLAs : చంద్ర‌బాబు జైలుతో..జ‌గ‌న్ ఇంటికే.! తాడేప‌ల్లి టాక్‌!!

Talk Of YCP MLAs :  వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి రోజుల్లో పూర్తికాలం ప‌నిచేస్తుందా? లేదా? అనే సందేహం క‌లిగింది.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 01:09 PM IST

Talk Of YCP MLAs :  వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి రోజుల్లో పూర్తికాలం ప‌నిచేస్తుందా? లేదా? అనే సందేహం క‌లిగింది. దానికి సెంటిమెంట్ ను మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ద‌ట్టించారు. ఏపీ చ‌రిత్ర‌లో 50శాతం మించి ఓట్ల‌ను సాధించిన ప్ర‌భుత్వాలు పూర్తి కాలం నిల‌వ‌లేద‌ని చెప్పారు. దాన్ని సెంటిమెంట్ గా చూపుతూ స్వ‌ర్గీయ ఎన్టీఆర్, స్వ‌ర్గీయ పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వాల‌ను ఉద‌హ‌రించారు. ఆయ‌న చెప్పిన సెంటిమెంట్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ విష‌యంలో ప‌నిచేయ‌లేద‌ని భావించ‌డానికి అవ‌కాశం ఉంది. అదే స‌మ‌యంలో ఉండ‌వ‌ల్లి చెప్పిన సెంటిమెంట్ ప‌రోక్షంగా ప‌నిచేసింద‌ని చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా మంగ‌ళ‌వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వైసీపీ రివ్యూ మీటింగ్ ను తీసుకోవ‌చ్చు.

గ్రాఫ్ ను స‌రిచేసుకోవ‌డానికి మ‌రో ఛాన్స్ (Talk Of YCP MLAs)

ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఇటీవ‌ల రివ్యూ మీటింగ్ ల‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వ‌హిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేల గ్రాఫ్ ల‌ను నిర్థారిస్తున్నారు. ప్ర‌ధానంగా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ పేరుతో త‌యారు చేసిన ప్రోగ్రామ్ గ‌త ఏడాది కాలంగా నిర్వ‌హిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కోసం గ్రామాల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీశారు. కొన్ని చోట్ల తిర‌గ‌బ‌డ్డారు. ఫ‌లితంగా క‌నీసం 30 మంది ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు మొఖం చాటేశారు. వాళ్ల మీద తొలి మీటింగ్ లోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. గ్రాఫ్ ను స‌రిచేసుకోవ‌డానికి మ‌రో ఛాన్స్ ఇస్తున్నానంటూ హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ వాళ్ల‌లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీటింగ్ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రాఫ్ బాగాలేని వాళ్ల‌కు (Talk Of YCP MLAs ) ఇవ్వ‌లేన‌ని తేల్చేశారు.

Also Read : Power Sure to TDP : వ‌చ్చే ఎన్నిక‌ల్లో YCP తిరుగులేని ఓట‌మి! లాజిక్ ఇదే..!

మూడు భాగాలుగా గ్రాఫ్ ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌యారు చేసిన‌ట్టు తెలుస్తోంది. గుడ్, నాట్ బ్యాడ్, బ్యాడ్ గా వ‌ర్గీక‌రించార‌ని తెలుస్తోంది. బ్యాడ్ గ్రాఫ్ ఉన్న వాళ్లు క‌నీసం 30 మంది వ‌ర‌కు ఉన్నార‌ని తెలుస్తోంది. అంటే, వాళ్ల‌కు టిక్కెట్లు ఇచ్చిన‌ప్ప‌టికీ గెలుపు అసాధ్య‌మ‌ని తేలిపోయింద‌ట‌. ఇక నాట్ బ్యాడ్ జాబితాలో 80 మంది ఉన్నార‌ని తెలుస్తోంది. అంటే, వాళ్లు రాబోవు మూడు నెల‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్టు చేస్తే గెలుపుకు ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. ఇక మిగిలిన 65 మంది గెలిచే అవ‌కాశం ఉంద‌ని గ్రాఫ్ ల‌ను త‌యారు చేసినట్టు తెలుస్తోంది. ఈ గ్రాఫ్ ల‌ను బేస్ చేసుకుని స‌గం మందికి పైగా టిక్కెట్లు లేవ‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంటే, ప్ర‌భుత్వం మీద సగం మంది కంటే పైగా ఎమ్మెల్యేలు (Talk Of YCP MLAs ) అసంతృప్తిగా ఉన్నార‌న్న‌మాట‌. ఈ లెక్క‌న ప్ర‌భుత్వం ప‌డిపోక‌పోయిన‌ప్ప‌టికీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి చెప్పిన సెంటిమెంట్ ఒక ర‌కంగా నిజ‌మేనంటూ కొందరు భాష్యం చెబుతున్నారు.

చంద్ర‌బాబును జైలుకు పంపిన త‌రువాత ఫ్యాన్ పార్టీ గ్రాఫ్  

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును జైలుకు పంపిన త‌రువాత ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని మెజార్టీ ఎమ్మెల్యేలు మొత్తుకున్నార‌ట‌. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం వాళ్ల మాట‌ల‌కు ప్ర‌తిగా రాబోవు రోజుల్లో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామ‌ని సంకేతాలు ఇచ్చార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ప‌వ‌న్ ను కూడా అవ‌స‌ర‌మైతే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఎమ్మెల్యేల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ట‌. ఎందుకంటే, రాబోవు రోజుల్లో టిక్కెట్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న చెప్పిన విధంగా అరెస్ట్ ప‌ర్వాన్ని కొన‌సాగిస్తే గెలుపు అసాధ్య‌మ‌ని  (Talk Of YCP MLAs ) వాళ్ల భావ‌న‌. అందుకే, టిక్కెట్లు త‌మ‌కు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్వాలేదంటూ ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో నొచ్చుకున్నార‌ట‌. సో..జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టిక్కెట్ల‌ను ఇవ్వ‌డం కాదు, ఆయ‌న పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి ఎమ్మెల్యేలు జంకుతున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లో గుప్పుమంటోన్న న్యూస్.

Also Read : YCP is not Single : సింహం సింగిల్ కాదు, ఆయ‌న‌కు ముగ్గురు..!