Site icon HashtagU Telugu

APCC Chief Sharmila : షర్మిలను కాస్త చూసుకోండి..కేంద్రానికి వైసీపీ సలహా..?

Sharmila - How Can You Become A Successor If You Don't Even Maintain The Project Built By Ys Sharmila

How Can You Become A Successor If You Don't Even Maintain The Project Built By Ys Sharmila

వైస్ షర్మిల (APCC Chief Sharmila) ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొన్నటి వరకు టీడీపీ , జనసేన , బిజెపి పార్టీల గురించే ప్రజలంతా మాట్లాడుకుంటూ వచ్చారు..కానీ ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ లో అడుగుపెట్టి..ఏపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిందో అప్పటి నుండి అంత మారిపోయింది. షర్మిల సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. పదునైన మాటలతో అధికార పార్టీ వైసీపీ (YCP) లోనే కాదు అటు కేంద్రంలోని బిజెపి సర్కార్ కు కూడా చెమటలు పట్టిస్తుంది.

గత నాలుగున్నరేళ్ల కాలంలో పెద్దగా చర్చకురాని ప్రత్యేక హోదా అంశాన్ని షర్మిల బయటకు తీసి ఒక్కసారిగా ప్రజలంతా మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని మాట్లాడుకునేలా చేసింది. అధికార పార్టీ వైసీపీతో పాటు అటు కేంద్రంలోని బీజేపీని నిలదీస్తున్నారు. ఇది పార్టీల నేతలకు పెద్ద సంకటంగా మారింది. “హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతానని చెప్పి ఇప్పటివరకు హోదా తీసుకురాలేదు” అంటూ షర్మిల తన ప్రసంగాల్లో తన అన్న, సీఎం, జగన్ ఫై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇక మోడీకి సైతం ప్రత్యేక హోదా (AP Special Status) ఫై లేఖ రాసారు. అలాగే కాంగ్రెస్ నేతాల్తో పాటు మిగతా పార్టీల నేతలను సైతం ఢిల్లీ లో షర్మిల కలిసి ప్రత్యేక హోదా కు మద్దతు పలకలంటూ కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో బీజేపీ పెద్దలు వైసీపీకి చెందిన ఎంపీ ఒకరిని పిలిచి అసలు ఏంజరుగుతుందని ఆరా తీసారట. “ప్రత్యేక హోదా అంశాన్ని కావాలనే తెరపైకి తెస్తున్నారు. మేం ఎదురుదాడికి దిగాం. మీ పార్టీ నుంచి ఎవ్వరూ స్పందించడం లేదు. అలా వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో మాకే కాదు మీకూ నష్టం చేకూరుతుంది” అని సదరు ఎంపీ బిజెపి పెద్దలకు చెప్పారట. దీంతో బిజెపి పెద్దలు..ఏపీ లోకల్ నేతలకు ఇక షర్మిల ను చూసుకోండి..ఎదురుదాడికి దిగండి అని ఆదేశాలు జారీ చేశారట. దీంతో బిజెపి నేతలంతా షర్మిల ఫై దాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వినికిడి.

Read Also : Upasana: నేను, చరణ్ ఇద్దరు ఇక్కడే పుట్టాం.. ఆ సిటీ అంటే చాలా ఇష్టం.. ఉపాసన కామెంట్స్ వైరల్?