Tadipatri: రాజకీయ టర్న్ తీసుకుంటున్న తాడిపత్రి సిఐ ఆత్యహత్య

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆనందరావు భార్య అనురాధతో

Tadipatri: తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆనందరావు భార్య అనురాధతో మనస్పర్థలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గత రాత్రి ఇద్దరికీ వాగ్వాదం జరిగినట్టు ప్రాధమిక సమాచారం. దీంతో తీవ్ర మానస్థాపానికి గురైన ఆనందరావు సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. ఆనందరావు 9 నెలల క్రితం కడప నుంచి తాడిపత్రికి బదిలీ అయ్యాడు.

తాడిపత్రి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వేధింపుల కారణంగానే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన మృతి చెందాడని అన్నాడు జేసి. ఇదిలా ఉంటే జేసి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. సీఐ ఆనందరావు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చనిపోయినట్టు నిరూపిస్తే తాను ఏ చర్యకైనా సిద్ధమని సవాల్ విసిరారు. దీంతో సిఐ ఆత్మహత్య రాజకీయంగా టర్న్ తీసుకుంది. అయితే సిఐ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More: Ashes 2023: బెయిర్ స్టో స్టంపౌట్ వివాదం…ఔటా ? నాటౌటా ?