Site icon HashtagU Telugu

AP : జూన్‌ 9న ప్రమాణస్వీకారం..ఎలాంటి అనుమనం లేదు..!: సజ్జల

Swearing in on 9th June..no doubt..!: Sajjala

Swearing in on 9th June..no doubt..!: Sajjala

Sajjala Ramakrishna Reddy : ఏపి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్ల(Counting agents)కు పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం(swearing in)ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం.. అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక , ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు తమకే పడ్డాయని.. టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని పేర్కొన్నారు. అయితే, బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఈసీ చంద్రబాబు వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిందంటూ సజ్జల మండిపడ్డారు.

Read Also: Vegetable Prices : సామాన్యులకు కూర‘గాయాలు’.. మండిపోతున్న ధరలు