Swarupanandandra : స‌నాత‌న‌ధ‌ర్మంపై జ‌గ‌న్ `ఆత్మ‌` ఘోష‌!

విశాఖ పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి స్వామి (Swarupanandandra) ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆత్మ‌. ప‌వ‌ర్ పాయింట్ గా విశాఖ‌పీఠం

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 02:43 PM IST

విశాఖ పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి స్వామి (Swarupanandandra) ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆత్మ‌. మ‌రో 30ఏళ్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా ఉండాల‌ని యాగాలు, పూజ‌లు చేస్తుంటారు. రెండ‌వ ప‌వ‌ర్ పాయింట్ గా ఇప్పుడు విశాఖ‌పీఠం వైసీపీ నాయ‌కుల‌తో వెలిగిపోతోంది. మంత్రివ‌ర్గం మార్పు సంద‌ర్భంగా ఫ్యాన్ పార్టీ వాళ్లు ఆయ‌న చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టారు. ప‌ద‌వి వ‌చ్చిన త‌రువాత ఆశీస్సుల కోసం క్యూ క‌ట్టారు. రాజ‌శ్వామ‌ల యాగం చేయ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎంగా ప్ర‌తీష్టించిన స్వామిగా ఆయ‌న‌కు పేరుంది. అంతేకాదు, సీఎం కేసీఆర్ ను రెండోసారి సీఎంగా చేయ‌డానికి కూడా పూజ‌లు చేశార‌ని కారు పార్టీకి ఇష్ట‌మైన స్వామి. ఇదంతా ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఉద‌య్ నిధి వ్యాఖ్య‌ల మీద ఆ స్వామి స్పందించారు. ఏపీలో స‌నాత‌న‌ధ‌ర్మానికి ఎంత హాని జ‌రుగుతున్న‌ప్ప‌టికీ మౌనంగా ఉండే స్వామి(Swarupanandandra) ఇప్పుడు ఎందుకు నోరు విప్పారు? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌.

విశాఖ పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి స్వామి (Swarupanandandra)

వాస్తవంగా స్టాలిన్, డీకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల క‌లిసి ఏదో రాజ‌కీయ డ్రామా జాతీయ స్థాయిలో ఆడుతున్నార‌ని ఇంగ్లీషు ప‌త్రిక‌ల్లోని తాజా న్యూస్. అలాంటి స‌మ‌యంలో స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉద‌య‌నిధి స‌నాత‌న‌ధ‌ర్మం మీద వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా వాటి ప్ర‌కంప‌న‌లు హోరెత్తుతున్నాయి. ఏకంగా రూ. 10కోట్ల‌ను ఉద‌య‌నిధి త‌ల‌పై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య ప్ర‌క‌టించారు. అదే కోవ‌లోకి వ‌చ్చేలా విశాఖ‌పీఠాధిప‌తి శాపం పెట్టారు. రాజ‌కీయ జీవితం లేకుండా `ఇదే నా శాపం..` అంటూ ప్ర‌క‌టించారు. హిందుస‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఏపీలో జరుగుతోన్న స‌నాత‌న‌ధ‌ర్మ విరుద్ధ విధానాల ప‌రిస్థితి ఏమిటి? అంటూ స్వామిని (Swarupanandandra) నెట్ జ‌న్లు ఆడుకుంటున్నారు.

స‌నాత‌న ధ‌ర్మాన్ని కించ‌ప‌రిచేలా సంఘ‌ట‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ స్వ‌రూపానందందేద్ర స్వామి మౌనం

నాలుగున్న‌రేళ్ల క్రితం సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసిన స్వామి కూడా స‌ర్వూపానందే. ఆ త‌రువాత సీఎం హోదాలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గోదావ‌రి, కృష్ణా న‌దుల్లో కూడా స్నానం చేయించారు. హిందూధ‌ర్మానికి ఏ మాత్రం హానీ చేయ‌కుండా ఉండేలా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన తొలి రోజుల్లోనే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బ‌స్ టిక్కెట్ల వెనుక జెరూస‌లెం యాత్ర ప్ర‌చారం మొద‌లు పెట్టారు. మీడియాలో రావ‌డంతో ఏదో పొర‌బాటును అలా జ‌రిగింద‌ని చ‌క్క‌దిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌రువాత ప‌లుమార్లు అన్య‌మ‌త ప్ర‌చారం తిరుమ‌ల కొండ‌ల మీద బ‌య‌ట‌ప‌డింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాల‌యాలు కూల్చివేత‌, విగ్ర‌హాల ధ్వ‌సం, ర‌థాలు త‌గుల‌బెట్ట‌డం త‌దిత‌రాలు ఎన్నో జ‌రిగాయి.

Also Real : AP CM Jagan Alternative Plan : ఆర్ 5 జోన్ విషయంలో జగన్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?

అన్న‌వ‌రం స‌త్యానారాయ‌ణ స్వామి సాక్షిగా పురోహితుల్ని వేలం వేశారు. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ గుడిలోకి అరాచ‌కాలు అనేకం. న‌ర‌సింహుని చంద‌నోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన అపచారాలు అంద‌రికీ తెలిసిన‌వే. ఇక ప్ర‌పంచ. ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిగిపోతోన్న శ్రీ వెంక‌టేశ్వ‌రుని కొండ‌పై జ‌రుగుతోన్న రాజ‌కీయ ప్ర‌చారాలు, రాజ‌కీయాలు హిందూ స‌మాజాన్ని ఆలోచింప చేస్తున్నాయి. తాజాగా టీటీడీ బోర్డు చైర్మ‌న్ గా క‌రుణాక‌ర్ రెడ్డిని నియ‌మించ‌డం ద్వారా అక్క‌డ కూడా క్రిస్టియ‌న్ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా..ఎన్నో స‌నాత‌న ధ‌ర్మాన్ని కించ‌ప‌రిచేలా సంఘ‌ట‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ స్వ‌రూపానందందేద్ర స్వామి మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్య‌ల‌పై మాత్రం నోరువిప్పారు. త‌న ఆత్మలా ఉండే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌మానా మీద నోరెత్త‌ని ఆయ‌న ఇప్పుడు ఉద‌య‌నిధిపై కాలుదువ్వ‌డం వెనుక వ్యూహం దేవుడికే ఎరుక‌.!

Also Read : INDIA Name Change : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మార్చే యోచనలో కేంద్రం