Site icon HashtagU Telugu

Swaroopanandendra Swami : సింహాచలం చందనోత్సవం.. భక్తుల ఆందోళన.. శారద పీఠం శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు..

Swaroopanandendra Swami sensational Comments in Simhachalam

Swaroopanandendra Swami sensational Comments in Simhachalam

నేడు సింహాచలం(Simhachalam) వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం(Chandanothsavam) కార్యక్రమం జరిగింది. స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చే ఈ రోజు లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. అయితే ఈ సంవత్సరం సింహాచలంలో భక్తులు ఆందోళన చేశారు. టికెట్లు ఉన్నా గంటల తరబడి క్యూలో నిల్చోపెడుతున్నారని, కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని, మంత్రులు, రాజకీయ ప్రతినిధుల కోసం మా దర్శనాలు ఆపేశారని అక్కడి ఆలయ అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు.

ఆలయ దర్శనానికి పలువురు YCP మంత్రులు రాగా వారితో కూడా భక్తులు వాగ్వాదానికి దిగి, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం, గంటల తరబడి ఎండలో నిల్చోవడంతో అక్కడికి వచ్చిన రాజకీయ ప్రతినిధులకు భక్తుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రులు అధికారులతో మాట్లాడి దర్శనం త్వరగా అయ్యేలా చూస్తామని తెలిపారు. అలాగే అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి శారద పీరం శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ కూడా విచ్చేశారు.

ఆయన దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు దర్శనం ఎందుకు చేసుకున్నానా అని అనిపిస్తుంది. అధికారులు దేవాలయం ప్రతిష్ట మంటగలిపారు. సింహాచలం పేదల దేవుడు, పెద్దల దేవుడు కాదు. కాని ఇక్కడ పెద్దలు మాత్రమే ఉన్నారు, వారికి మాత్రమే దర్శనం కలుగుతుంది. సాధరణ భక్తుల కేకలు వింటుంటే ఏడుపు వస్తుంది. సింహచలం చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. అధికారులు అత్యంత దారుణమైన తీరు కనబరిచి ఆలయ ప్రతిష్ట దిగాజార్చరు. భక్తుల ఆర్తనాదలు అధికారులకు తగులుతాయి అని అన్నారు. దీంతో శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read :  KCR Compete With Modi: మోడీకి పోటీగా కేసీఆర్..! తెలంగాణలో గరుడ గంగా పుష్కరాల చోద్యం..!