Pithapuram Varma : మరో బాంబ్ పేల్చిన ఎస్వీఎస్ఎన్ వర్మ ..

పిఠాపురంలో పవన్ తప్పుకుంటే బరిలో నిలిచేది నేనే అని..అందులో ఎలాంటి సందేహం ఉండదని చెప్పుకొచ్చారు

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 03:48 PM IST

ఏపీలో పిఠాపురం (Pithapuram ) స్థానం కాకరేపుతుంది. జనసేన అధినేత (Pawan Kalyan) ఇక్కడి నుండి బరిలోకి దిగుతుండగా..వైసీపీ (YCP) నుండి వంగా గీత బరిలో నిల్చుంది. అయితే ఇదే స్థానం ఫై టీడీపీ స్థానిక నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఎంతో ఎదురుచూసారు. ఆయనకే టికెట్ అని చెప్పి ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఇవ్వడం తో కాస్త నిరాశ కు గురయ్యారు. ఆయన అనుచరులు సైతం వర్మ కే టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేసారు. కానీ అధినేత బాబు..వర్మ తో మాట్లాడి సర్ది చెప్పారు. ఆ తర్వాత పవన్ గెలుపుకు కృషి చేస్తానని చెప్పి..ప్రచారం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వర్మ లో ఆగ్రహం నింపాయి. మంగళవారం కాకినాడ ఎంపీ సీటుకు పవన్ కళ్యాణ్ జనసేన తరుఫున ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. టీటైమ్ యజమాని ఉదయ్‌ శ్రీనివాస్‌ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తన కోసం, పార్టీ కోసం ఉదయ్ ఎంతో త్యాగం చేశారని అన్నారు. అందుకే ఉదయ్‌కు ఎంపీ టికెట్ కేటాయించినట్లు చెప్పారు. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా సూచనతో ఒకవేళ తాను ఎంపీగా బరిలోకి దిగితే మాత్రం.. పిఠాపురం అసెంబ్లీ నుంచి ఉదయ్ పోటీ చేస్తారని ఉన్నారు. తామిద్దరం స్థానాలు మార్చుకుంటామని చెప్పుకొచ్చారు. దీంతో వర్మ ..పిఠాపురంలో పవన్ తప్పుకుంటే బరిలో నిలిచేది నేనే అని..అందులో ఎలాంటి సందేహం ఉండదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా, చంద్రబాబుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి పాటుపడతానని స్పష్టం చేశారు. మరి పవన్ ఎంపీ బరిలో నిల్చుంటారా..లేదా అనేది చూడాలి.

Read Also : Kancharla Chandrasekhar Reddy : అవసరమైతే పుష్ప ను రంగంలోకి దింపుతా అంటున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి