Avinash Reddy: అవినాష్ పై అనుమాలెన్నో..! సీబీఐ పిటిషన్‌ లో సంచలన మలుపు

వైఎస్ వివేకా మర్డర్‌ కేసులో అనుమానాలన్నీ అవినాష్‌రెడ్డి (Avinash Reddy)పైనే అంటోంది సీబీఐ (CBI). ఇప్పటికీ ఆరు ప్రశ్నలకు అవినాష్‌ నుంచి సమాధానాలు రాలేదని కోర్టుకు చెప్పింది.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 11:45 AM IST

వైఎస్ వివేకా మర్డర్‌ కేసులో అనుమానాలన్నీ అవినాష్‌రెడ్డి (Avinash Reddy)పైనే అంటోంది సీబీఐ (CBI). ఇప్పటికీ ఆరు ప్రశ్నలకు అవినాష్‌ నుంచి సమాధానాలు రాలేదని కోర్టుకు చెప్పింది. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ ఫైల్‌ చేసిన సీబీఐ, అనేక సంచలన విషయాలను వెల్లడించింది. మర్డర్‌ జరిగిన రోజు ఏం జరిగిందో సీన్‌ టు సీన్‌ రివీల్‌ చేసింది. ఇంతకీ, సీబీఐ చెప్పిన ఆ సీక్రెట్స్‌ ఏంటి?. అసలా రోజు ఏం జరిగింది!

వైఎస్‌ వివేకా మర్డర్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయ్‌. కోర్టుకెళ్లిన ప్రతిసారీ సంచలన విషయాలు వెల్లడిస్తోంది సీబీఐ. అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ వేసిన సీబీఐ, నిందితులపై మోపిన అభియోగాలను రివీల్‌ చేసింది. ఎంపీ అవినాష్‌పై మెయిన్‌గా రెండు నేరాలను మోపింది. ఒకటి వివేకా హత్య, రెండోది ఆధారాలను మాయం చేయడం.. ఈ రెండింటినీ ప్రధానంగా ప్రస్తావించింది సీబీఐ. అవినాష్‌రెడ్డితోపాటు గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌, దస్తగిరిపై హత్యానేరం… భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, శివశంకర్‌, అవినాష్‌పై ఆధారాలు చెరిపినట్టు అభియోగాలు మోపింది.

Also Read: CM Jagan : నేడు వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా ప‌థ‌కాల‌కు నిధులు విడుదల చేయ‌నున్న సీఎం జ‌గ‌న్‌

వివేకా మర్డర్‌ జరిగిన రోజు అసలేం జరిగిందో సీన్‌ టు సీన్‌ బయటపెట్టింది సీబీఐ. మర్డర్‌ జరిగిన రోజు రాత్రి 11గంటల 45నిమిషాలకు వివేకా ఇంటికొచ్చాడు గంగిరెడ్డి. అర్ధరాత్రి 12.30వరకు ఇద్దరు మాట్లాడుకున్నారు. సిగరేట్‌ కోసం బయటికొచ్చిన వివేకా… ఈరోజు గంగిరెడ్డి ఇక్కడే ఉంటాడంటూ వాచ్‌మెన్‌ రంగన్నకు చెప్పినట్టు వెల్లడించింది. ఇక, గూగుల్‌ టేక్‌ఔట్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. మర్డర్‌ జరిగినప్పుడు సునీల్‌ యాదవ్‌… అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్టు చెప్పింది. హత్యకు ముందూతర్వాత సునీల్‌ యాదవ్‌ ఎక్కడెక్కడ ఉన్నాడో 33 గూగుల్‌ లొకేషన్స్‌ను తీసింది సీబీఐ.

ఎంపీ అవినాష్‌పై అనేక అనుమానాలు లేవనెత్తింది సీబీఐ. వివేకా మర్డర్‌ జరిగిన రెండ్రోజుల తర్వాతే ఎందుకు అవినాష్‌ను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఎంపీ టికెట్‌ షర్మిలకు ఇవ్వాలని వివేకా ఒప్పించింది నిజం కాదా!. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధం ఎక్కడ?. సునీల్‌ యాదవ్‌కి అవినాష్‌ మధ్యున్న సంబంధాలు. హత్యకు ముందురోజు అవినాష్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడు?. ఓబుల్‌రెడ్డి, భరత్‌యాదవ్‌లు ఎందుకు దస్తగిరి వెంటపడ్డారు!. మర్డర్‌ కోసం జరిగిన 4కోట్ల లావాదేవీలపై అవినాష్‌ నుంచి ఆన్సర్స్‌ రావాల్సి ఉందంటోంది సీబీఐ.