వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరగా, వైద్యులు చేసిన పరీక్షల్లో మూడు వాల్వులు బ్లాక్ (Three valves block) అయినట్లు గుర్తించారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స (surgery)చేయాల్సి ఉందని తేలింది. అయితే ఈ ఆపరేషన్ అత్యవసరమైనది కాదని, కొంత సమయం తీసుకుని సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి కుటుంబ సభ్యులు ఇతర ఆసుపత్రుల్లోని వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
CM Revanth Reddy : డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
కొడాలి నాని అనారోగ్య వార్త తెలియగానే, వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ స్వయంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి నాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైద్యులతో పాటు నాని కుటుంబ సభ్యులతోనూ జగన్ మాట్లాడి, అవసరమైన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. నాని ఆరోగ్య పరిస్థితి పై పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొడాలి నాని త్వరలోనే పూర్తిస్థాయి చికిత్స చేయించుకుని తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Prabhas Wedding : హైదరాబాద్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి..?
ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొలుత జరిగిన పరీక్షల అనంతరం సర్జరీ తప్పనిసరి అన్నది తేలినా, స్టంట్లు వేయాలా లేదా బైపాస్ సర్జరీ చేయాలా అనే విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఉగాది తరువాత పూర్తి స్థాయి చికిత్స పొందాలని నాని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉండగా, తన ఆరోగ్యంపై అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొడాలి నాని పేర్కొననున్నారని సమాచారం.