ఈసారి ఏపీ ఎన్నికలు ఏ రేంజ్ లో జరిగాయో చెప్పాల్సిన పనిలేదు. గత రెండు నెలలుగా నువ్వా..నేనా అనే రేంజ్లో అధికార పార్టీ వైసీపీ – అటు కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎవరికీ వారు వారి వారి ఎన్నికల ప్రచార వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తే.కూటమి మాత్రం అభివృద్ధి , ఉద్యోగ అవకాశాలు , రాష్ట్రానికి రాజధాని, రాష్ట్రానికి సంపద సృష్టించడం వంటివి ప్రధాన ఏజెండాలతో ప్రజల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ప్రజలు మాత్రం కూటమి ఏజెండాకే మొగ్గు చూపించారని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ (alapati Suresh) చెపుతున్నారు. అలాగే జగన్ చేసిన తప్పులు..కూటమి కలిసొచ్చేలా చేశాయని అంటున్నారు.
* నిరుద్యోగం : జగన్ ఎంతసేపు బటన్ నొక్కాను…బటన్ నొక్కాను అంటూ నొక్కి నొక్కి చెప్పారు తప్ప..మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను.. ఈ ఐదేళ్లలో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను..అని చెప్పలేకపోయాడు. దానికి కారణం ఈ ఐదేళ్లలో ఆయన ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. దీంతో ఉన్నంత చదువులు చదువుకున్న స్టూడెంట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఏదో ఒక పనిచేసుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్నారు. ఇదే కూటమి తమ ప్రచారం లో చెప్పి యువతను ఆకట్టుకుంది. కూటమి వస్తే మొదటి సంతకం మెగా DSC పైనే అని..రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు అందిస్తామని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
* మద్యం నిషేధం : జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ..తాను అధికారంలోకి రాగానే మద్యం నిషేదిస్తానని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక స్వయంగా ఆయనే మద్యం అమ్మడం మొదలుపెట్టారు. ఇది ప్రజల్లో ఆగ్రహం నింపింది. జగన్ మాట తప్పుతాడు అనేదానికి ఇదో ముఖ్య ఉదాహరణ గా నిలిచింది.
* రాజధాని : ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతిని రాజధాని గా ప్రకటించి నిర్మాణం చేపట్టారు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చి..మూడు రాజధానులు అంటూ కొత్త నినాదం తీసుకొచ్చి అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసారు. ఇది కూడా ఓ తప్పయింది. ప్రతి ఒకరు ఏపీకి రాజధానే లేదని ఎద్దేవా చేయడం చేసారు.
* రాష్ట్ర అభివృద్ధి : దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఐదేళ్లలో జగన్ ఎక్కడ కూడా గుంతలు కూడా పూడ్చలేకపోయాడంటే అర్ధం చేసుకోవాలి..ఏ మేర అభివృద్ధి చేసాడో..అదే ప్రజల్లో మార్పు కోరుకునేలా చేసింది. రోడ్లు లేవు , కొత్త పరిశ్రలు తీసుకరాలే..ఎలాంటి అభివృద్ధి జరగలే అని అంత మాట్లాడుకున్నారు.
* ప్రచారంలో పవన్ పెళ్లిళ్ల అంశం : ఇది కూడా జగన్ చేసిన తప్పే. ఎంతసేపు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని చెపుతూ ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు. అసలు పవన్ పెళ్లిళ్లకు రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉందా..? అని ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి చెప్పమంటే..పవన్ మూడు పెళ్లిళ్ల ముచ్చట చెప్పి..ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నాడు.
* పోలవరం ప్రాజెక్ట్ : చంద్రబాబు హయాంలో కట్టిన కట్టడమే తప్ప ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఇలా ఎన్నో తప్పులు చేసి..కూటమి ఫై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేసాడు. జగన్ చేసిన తప్పులను ప్రజల్లోకి కూటమి నేతలు తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. మరి ఇది ఓట్ల రూపంలో సక్సెస్ ఇస్తుందా..;లేదా అనేది చూడాలి.
Read Also : Sudigali Sudheer : సుధీర్ బ్యాక్ టు స్మాల్ స్క్రీన్.. ఫ్యామిలీ స్టార్స్ తో ఎంట్రీ..!
