Site icon HashtagU Telugu

CM Jagan : ఢిల్లీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేసు హ‌వా!`బెంచ్`హంటింగ్ దుమారం!!

Supreme Jagan

Supreme Jagan

ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Supreme Jagan) హ‌వా సుప్రీం కోర్టు వ‌ర‌కు చేరింది. న్యాయమూర్తుల‌ను, న్యాయ‌స్థానాల‌ను కూడా రాజ‌కీయ గొడుగు కింద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసిన దిట్ట ఆయ‌న‌. తాజాగా ఆయ‌న‌కు సంబంధించిన అక్ర‌మాస్తుల కేసును సుప్రీం కోర్టులోని ఒక బెంచ్(Bench Hunting) నుంచి మ‌రో బెంచ్ కు తేలిగ్గా మార్చేసే స్థాయికి ఎదిగార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌. సుప్రీం కోర్టు వ‌ర్గాల్లో గ‌త రెండు రోజులుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్మార్ట్ నెస్ గురించి న్యాయ‌వాదులు, ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్నారు. ఆ విష‌యాన్ని ఒక ఇన్విస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్ బ‌య‌ట పెట్టారని టాక్‌.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌వా సుప్రీం కోర్టు (Supreme Jagan) 

ఇంత‌కీ ఆ ఇన్విస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ బ‌య‌ట‌కు పెట్టిన అంశం ఏమంటే, బెంచ్ హంటింగ్ కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Supreme Jagan) ఎలా పాల్ప‌డ్డారు అనేది. ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోన్న ప్ర‌కారం ఏపీ సీఎం జగన్ భార్య భారతి పేరు మీద ఉన్న భారతి సిమెంట్స్ ఉంది. ఆ కంపెనీ తాలూకూ అక్రమాస్తులు, అవినీతి, మనీలాండరింగ్ కేసులపై ఈడీ సవాల్ చేసింది. ఆ కేసుపై జరగాల్సిన విచారణ బెంచ్(Bench Hunting) హఠాత్తుగా మారిపోయింద‌ని సుప్రీంకోర్టు వర్గాల్లోని సంచలనం అంశం. దీనిపై ఈ న్యాయ వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతోంది. సౌరవ్ దాస్ అనే ఇన్వెస్టిగేవటివ్ జర్నలిస్ట్ దీనికి సంబంధించిన సీక్రెట్ మొత్తాన్ని సోషల్ మీడియాలో బయట పెట్టారు. పూర్తి ఆధారాతో పెట్టిన ఈ సోషల్ మీడియా పోస్టు, ఏపీతో పాటు ఢిల్లీ న్యాయవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయింది.

Also Read : Jagan IPS : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ రాజ‌నీతి! సునీల్ కు ఒక‌లా, ఏబీకి మ‌రోలా.!

జగన్ అక్రమాస్తుల కేసుల్లో భారతి సిమెంట్స్‌కు సంబంధించి గతంలో ఈడీ కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. అయితే హైకోర్టు ఆ జప్తును తొలగించింది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జస్టిస్ మురారి, జస్టిస్ అమానుల్లా ధర్మాసనంలో జరిగేలా లిస్ట్ అయింది. అయితే హఠాత్తుగా అది లిస్ట్ నుంచి డిలీట్ (Bench Hunting) అయింది. తర్వాత ఈ కేసును కోర్టు నెంబర్ 15కు కేటాయించినట్లుగా కంప్యూటర్‌లో లిస్ట్ అయిన‌ట్టు గుర్తించారు. ఇది ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కోర్టు నెంబర్ 15లో విచారణ జరిపేది జస్టిస్ వి.రామసుబ్రమణియన్.

కేసు రామ సుబ్ర‌మ‌ణియ‌న్ దగ్గరకే ఎందుకు వెళ్లింది?

కేసు రామ సుబ్ర‌మ‌ణియ‌న్ దగ్గరకే ఎందుకు వెళ్లింది? అనేది కూడా సౌరవ్ దాస్ విశ్లేషించారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దగ్గర కోర్టు క్లర్క్‌గా   పని చేస్తున్నది సిర్గాపురపు నిరంజన్ రెడ్డి కుమారుడు. ఈ నిరంజన్ రెడ్డి ఎవరో కాదు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Supreme Jagan) రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసిన ఎంపీ కమ్ సుప్రీంకోర్టు లాయర్. జగన్ అక్రమాస్తుల కేసుల‌ను ఎప్పట్నుంచో వాదిస్తున్నారు. ఆయ‌న‌ కుమారుడు కోర్టు క్లర్క్‌గా పని చేస్తున్న న్యాయమూర్తి సుబ్ర‌మ‌ణియ‌న్ దగ్గర ఈ కేసు లిస్ట్ అయింది. ఈ విషయాన్ని సౌరవ్ దాస్ ప్రశ్నిస్తున్నారు.

Also Read : Jagan : ఎమ్మెల్యేల‌కు గ్రాఫ్ ద‌డ‌! ముగిసిన డెడ్ లైన్, 70 మందికి మూడిన‌ట్టే..!

అసలు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ హఠాత్తుగా కేసుల్ని ఓ బెంచ్ మీద నుంచి మరో బెంచ్ (Bench Hunting)మీదకు ఎందుకు మారుస్తోంది..? దీని వెనుక అసలేం జరిగింది? అనే అనుమానాలను సౌరవ్ దాస్ న్యాయవ్యవస్థ ముందు ఉంచారు. ఇది బెంచ్ హంటింగ్‌కు పాల్పడటమేనని, న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేలా సుప్రీంకోర్టులో పరిణామాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఉద్యోగులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంశం సుప్రీంకోర్టులోనూ (Supreme Jagan) సంచలనంగా మారుతూండటంతో ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.

Exit mobile version