Site icon HashtagU Telugu

Supreme Decision: గ్రామ, వార్డు వాలంటీర్ల పై సుప్రీమ్ నిర్ణయం

Supreme Decision On Village And Ward Volunteers

Supreme Decision On Village And Ward Volunteers

Supreme Court Decision on Village, Ward Volunteers : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వ్యవహారం సుప్రీమ్ కోర్ట్ (Supreme Court) కు చేరింది. అడ్డగోలుగా వాళ్ల నియామకాలు ఉన్నాయని, ఎలా నియామకం జరిగింది? వాళ్ళు ఎవరు? విధులు, భాద్యతలు ఏమిటి? అనేదానిపై సీరియస్ చర్చ జరిగింది. ఏపీలో ఉన్న 2.56 లక్షల మంది వలంటీర్లు 1.45 లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విస్తృత సర్క్యులేషన్ ఉన్న పత్రిక కొనుగోలు చేయడానికి రూ.200 చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రెండు వేర్వేరు జీవోలు విడుదల చేసింది. ఈ రెండింటిని సవాల్ చేస్తూ ‘ఈనాడు’ ప్రచురణకర్త అయిన ఉషోదయ పబ్లికేషన్స్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ జీవోల్లో ‘సాక్షి’ పత్రిక అనే పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు పార్టీ కార్యకర్తలు ‘ఈనాడు’ను ఎల్లో మీడియాగా విమర్శిస్తూ దాన్ని చదవొద్దని ప్రచారం చేస్తున్నారని ఉషోదయ కోర్టు దృష్టికి తెచ్చింది. తద్వారా వలంటీర్లు సచివాలయ ఉద్యోగులంతా సాక్షినే కొనుగోలు చేయాలని పరోక్షంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఆక్షేపించింది. ఆ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 10న విచారణ జరిగింది. ఈ కేసును ఏపీ హైకోర్టులో చేపట్టిన తీరు చాలా ఆందోళనకరంగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ రిట్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్కు బదిలీ చేస్తామని దానిపై వారే విచారణ చేపడతారని పేర్కొంది.ఈ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం తరుఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో ఏప్రిల్ 21న విచారణకు రానున్న తరుణంలో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తే అనవసరంగా జాప్యం జరుగుతుందన్నారు.

ముకుల్ రోహత్గీ బదులిస్తూ ఉషోదయ సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను పాత పిల్తో కలిసి విచారించడానికి వీల్లేదని అందువల్ల దాన్ని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయడమే సమంజసమని వాదించారు. అవసరమైతే జీఓలు తదుపరి పరిణామాలపై స్టే ఇస్తామని పేర్కొంటూ ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.

వార్డు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు… సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులో ఉషోదయ వేసిన రిట్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తామని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ జస్టిస్ పీఎస్ నరసింహ జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఎవరు వారి నియామకం ఎలా జరుగుతుందని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రతివాది ‘ఈనాడు’ పత్రిక తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ దేవదత్ కామత్ న్యాయవాది మయాంక్ జైన్ సమాధానం ఇస్తూ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలని తెలిపారు. రాజకీయ ఎజెండాతోనే వారంతా పనిచేస్తున్నారని చెప్పారు. తదుపరి విచారణ ఆసక్తిగా మారింది.

Also Read:  YCP vs TDP: వైసీపీ కి పోటీగా టీడీపీ ప్రోగ్రామ్ ‘ సైకో పోవాలి – సైకిల్ రావాలి’