Chandrababu Quash Petition : సుప్రీం కోర్ట్ లో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురైంది

ఈరోజు సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తుందని అనుకున్నారు కానీ సుప్రీం మాత్రం రేపటికి వాయిదా వేసింది

Published By: HashtagU Telugu Desk
Supreme Court Verdict Prono

Supreme Court Verdict Prono

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు వరుస షాకులు తగులుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. బాబు జైలు కు వెళ్లి 30 రోజులు కావొస్తున్నా ఆయన్ను బయటకు తీసుకరాలేకపోతున్నారు. ఒకటి రెండు కాదు బాబు ఫై ఏకంగా నాల్గు ,ఐదు కేసుల వరకు ఏపీ సర్కార్ పెట్టడం తో ఆయనకు బెయిల్ తీసుకొచ్చేందుకు లాయర్లు తంటాలుపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు ఫై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లఫై ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు కేసులో ఇప్పటికే పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో… చంద్రబాబుకు ఈ కేసులో కచ్చితంగా బెయిల్ వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే, హైకోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేసి షాక్ ఇచ్చింది. దీంతో బాబు తరుపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటె సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన తరుఫు లాయర్లు క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) వేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఈరోజు సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తుందని అనుకున్నారు కానీ సుప్రీం మాత్రం రేపటికి వాయిదా వేసింది.

గతంలో వాదనల దగ్గరే ఆపేసిన సుప్రీంకోర్టు.. ఈరోజు కూడా అటు సీఐడీ (CID).. ఇటు చంద్రబాబు తరఫున లాయర్ల వాదనలు విన్నది. దీనిపై రేపు తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. కానీ రేపు తీర్పు రావడం కష్టమే అంటున్నారు. ఇంకా వాదనలు వినాల్సి వస్తుందని న్యాయస్థానం చెప్పడం తో రేపంతా కూడా వాదనలు వింటారని..బుధువారం తీర్పు వెల్లడిస్తారని భావిస్తున్నారు.

Read Also : KCR Election Campaign : సెంటిమెంట్ గడ్డపై కేసీఆర్ మొదటి సభ..

  Last Updated: 09 Oct 2023, 07:10 PM IST