YS Viveka Case : జ‌గ‌న్ కు అవ‌మానం, తెలంగాణ‌కు బాబాయ్ హ‌త్య కేసు బ‌దిలీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 05:42 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ విష‌యంపై టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు ట్వీట్ చేస్తూ సొంత బాబాయ్ కేసును ఇత‌ర రాష్ట్రానికి వెళ్ల‌డం సిగ్గ‌చేట‌ని అన్నారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మృతుడి కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం ముగించింది. ఈ క్రమంలోనే ఈరోజు కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేశారు. కేసు దర్యాప్తుపై వివేకా కుమార్తె, భార్య సంతృప్తి చెందలేదని, బదిలీకి ఆదేశిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీబీఐ, వైఎస్ సునీతలను ప్రతివాదులుగా చేర్చారు. శివశంకర్ రెడ్డి తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. వివేకా హత్య కేసు మరో రాష్ట్రానికి బదిలీపై తీర్పు వెలువడిన తర్వాత నిందితుడు గంగిరెడ్డి బెయిల్‌పై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.