వివేక హత్య కేసు (Viveka Murder Case) అనేక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై అవినాష్ రెడ్డి (Avinash Reddy) న్యాయవాది ఇప్పటికిప్పుడు స్టే ఇస్తే తన క్లయింట్‌ను సీబీఐ (CBI) అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది సుప్రీంకోర్టు.
తెలంగాణ (Telangana) హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. హైకోర్టు (High Court) ఆదేశాలపై స్టే ఇచ్చి మరోసారి విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై రెండురోజులపాటు విచారణ జరిగింది. 25వతేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ చెప్పిన విషయం తెలిసిందే.
Also Read: Mammootty’s Mother: మలయాళ ఇండస్ట్రీలో విషాదం.. మమ్ముట్టి తల్లి కన్నుమూత!