Supreme Court orders to Jogi Ramesh and Avinash : వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్ తమ పాస్‌పోర్టులను 24 గంటల్లోపు దర్యాప్తు అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వారిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ చేపట్టింది. 3 వారాలపాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నిందితులు పూర్తిస్థాయిలో విచారణకు సహకరించాలని.. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సాంకేతిక కారణాలతో ఈరోజు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. నవంబర్ 4న జరిగే తదుపరి విచారణలో వారి ముందస్తు బెయిల్‌పై సుప్రీం తేల్చనుంది. అప్పటివరకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దర్యాప్తునకు సహకరించకపోతే రక్షణ ఉండదని స్పష్టం చేసింది.
Read Also: Sitaram Yechury : సీతారాం ఏచూరి మరణం ఫై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగమ సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు సబ్‌జైలులో ఉన్నారు. ఆయన్ని ఈ మధ్యే వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆయనకి కూడా ఈ కేసులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల మంజూరు చేసిన వారిలో నందిగమ సురేష్ ఉన్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నారు. చంద్రబాబు ఇంటిపైకి దండెత్తారు. ఈ కేసులో జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు ఖాయమని భావించిన జోగి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకి కడా సుప్రీం కూడా బెయిల్ మంజూరు చేసింది.