Site icon HashtagU Telugu

Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో బెయిలు మంజూరు

MLC Anantha Babu Supreme Court

Mlc Anantha Babu

ఎమ్మెల్సీ అనంతబాబుకు (MLC Anantha Babu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేసింది. అయితే, షరతులను కింది కోర్టు విధించాలని ఆదేశించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ మేరకు తీర్పును వెలువరించింది. మరోవైపు అనంతబాబు (Anantha Babu) పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఆయన బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి వేసిన పిటిషన్ ను విచారించడానికి ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి నెలకు వాయిదా వేసింది.

Also Read:  Butterfly : హాట్ స్టార్ లో ‘బటర్ ఫ్లై’ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో తెలుసా..!