Site icon HashtagU Telugu

Supreme Court : సుప్రీంకోర్టులో ల‌క్ష్మీపార్వ‌తికి షాక్‌.. ఆ పిటిష‌న్‌ను..?

Lakshmi Parvathi Imresizer

Lakshmi Parvathi Imresizer

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరిపించాలని ఎన్టీఆర్‌ భార్య, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇతరుల ఆస్తులపై విచారణ కోరుతూ లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దినేష్ మహేశ్వరి, బేలా త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టేసింది.

ఇతరుల ఆస్తులు తెలుసుకోవాలంటే ఆమె ఎవరని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఎవరి ఆస్తులను తెలుసుకోవాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఇందులో ఎలాంటి అర్హత లేదని అభిప్రాయపడింది. చంద్రబాబు ఆస్తులపై దర్యాప్తు చేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. 2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తుల వివరాల ఆధారంగా లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1987 నుంచి 2005 మధ్య కాలంలో చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణ జరిపించాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.