Site icon HashtagU Telugu

Pinnelli : పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్‌

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy: సుప్రీం కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు షాక్ తగిలింది. సుప్రీం కోర్టు(Supreme Court)లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు పై విచారణ జరిగింది. హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో నంబూరు శేషగిరిరావు(Nambur Seshagiri Rao) సవాలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు(counting center) వెళ్ళొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

Read Also: Sonia Gandhi : ఎగ్జిట్ పోల్స్ తూచ్.. గెలిచేది మేమే : సోనియాగాంధీ

మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందటూ.. పాల్వాయిగేటు ఘటన బాధితుడు, టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందన్నాడు.