Site icon HashtagU Telugu

Nara Lokesh: పోల‌వ‌రం నిర్వాసితుల‌ను ఆదుకోండి.. జ‌గ‌న్ కు లోకేష్ లేఖ‌!

Lokesh And Jagan

Lokesh And Jagan

పోల‌వ‌రం నిర్వాసితులపు ఆదుకోవాలని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పశ్చిమగోదావరిలోని 19 ప్రభావిత గ్రామాలకు చెందిన 1500 మందికి పైగా నిర్వాసితులను తదుపరి సహాయం అందించకుండా బలవంతంగా వెళ్లగొట్టిన తీరుపై సీఎంకు రాసిన లేఖలో లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బాధిత కుటుంబాలు నాలుగు వారాలుగా నిరసన దీక్షలు చేస్తున్నా స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోలేదని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిర్వాసిత కుటుంబాలు ఆరు నెలల క్రితం నిర్వాసితులైనప్పుడు వారంతా కలిసి నిరసనలు చేస్తుంటే ఎమ్మెల్యే, స్థానిక తహశీల్దార్ ఒక్కసారి మాత్రమే సందర్శించారని లోకేష్ తెలిపారు. నిర్వాసితులు ఐక్య వేదికలో 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని… కానీ ఇంతవరకు అది జరగలేదని లోకేష్ పేర్కొన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారంలో కాలయాపన చేసేందుకు మాత్రమే ప్రణాళికలు రచిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. వరద ముప్పును సాకుగా చూపి నాలుగు మండలాల నుంచి 1500 మంది నిర్వాసితులను తరలించినట్లు నారా లోకేష్ సీఎంకు తెలిపారు. అయినా అధికారులు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని.. బోర్డింగ్‌, తాగునీటి సౌకర్యాలు లేవు.ని ప్ర‌స్తావించారు ఒంటిపై బట్టలు వేసుకుని బయటకు వచ్చిన వారు ఇప్పుడు అద్దె చెల్లించలేకపోతున్నారని తెలిపారు. పోలవరం ఏటిగట్టు సెంటరులో ఐక్య వేదిక ఆధ్వర్యంలో బాధిత నిర్వాసితులు రిలేదీక్షలు చేపట్టారు.

ప్రతిరోజూ 30 మందికి పైగా గిరిజన నిర్వాసితులు నిరాహార దీక్షలు చేస్తున్నారుని లేఖ‌లో ప్ర‌స్తావించారు. పుట్టిన ఊళ్లలో ఆనందంగా జీవించే ఆదివాసీలు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో అనిశ్చిత జీవితాలను గడపాల్సి వస్తోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులందరికీ చట్ట ప్రకారం తక్షణమే పునరావాసం కల్పించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. సీఎం ప్రకటించిన రూ. 10 లక్షల ప్యాకేజీ వీలైనంత త్వరగా అందించాల‌ని.. నిర్వాసిత కుటుంబాలన్నింటికీ R&R ప్యాకేజీని సంపూర్ణంగా అందించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.