Site icon HashtagU Telugu

Rushikonda : రుషికొండ ఫై నిర్మాణాల పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Rushikonda Construction

Rushikonda Construction

రుషికొండ ( Rushikonda ) పై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ( Supreme Court ) లో వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. విశాఖ రుషికొండ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని శివరామ్ ప్రసాద్ (Lingamaneni Sivaram Prasad) దాఖలు చేసిన పిల్ ను సుప్రీం కొట్టేసింది. రాజకీయ కారణాలతోనే ఈ పిటిషన్ వేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇప్పటికే హైకోర్టు, ఎన్జీటీలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటేషన్‌లో విజ్ఞప్తి చేశారు. NGT, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంకోర్టుకు పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ ను కోర్ట్ కొట్టేసింది.

Read Also : IT Raids : రెండో రోజు కూడా కాంగ్రెస్ నేతల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ రైడ్స్