ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘సూపర్ సిక్స్’ హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. నేడు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ (“Super Six Super Hit” Public Meeting) అనే పేరుతో విజయోత్సవ సభ జరగబోతుంది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.
TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే..స్పష్టం చేసిన నారా లోకేష్
ఈ సభలో కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ‘సూపర్ సిక్స్’ హామీల గురించి కూటమి నాయకులు ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. వీటిలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ మంచి నీటి పథకం, అలాగే యువతకు ఉద్యోగాల కల్పన వంటివి ఉన్నాయి. పారదర్శకమైన పాలన, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలుపనున్నారు.
రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సభలో వివరించనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలియజేయనున్నారు. ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని, భవిష్యత్తుపై ఆశను కలిగించడంలో విజయం సాదిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.