Site icon HashtagU Telugu

Super Six – Super Hit : కూటమి పాలనలో అభివృద్ధికి అడ్డులేదు.. సంక్షేమానికి తిరుగులేదు

Supersixsuperhit

Supersixsuperhit

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయి. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. ‘సూపర్ సిక్స్’ (Super Six – Super Hit) పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతోంది. దీనిలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏడాదికి రూ.33,600, తల్లికి వందనం పథకం కోసం రూ.10 వేల కోట్లు, అన్నదాత సుఖీభవ మొదటి విడతలో రూ.3,173 కోట్లు, రాయితీ సిలిండర్ల కోసం రూ.2,684 కోట్లు విడుదల చేసింది. ఇది కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు పట్ల ఎంత నిబద్ధతతో ఉందో చాటి చెబుతుంది.

సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘స్తీ శక్తి’ పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. మత్స్యకారులకు రూ.259 కోట్లతో ఆర్థిక సహాయం అందించింది. అలాగే, ఆలయాల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ధూపదీప నైవేద్యం కోసం రూ.10 వేలు కేటాయించింది. అర్చకుల కనీస వేతనం రూ.15 వేలకు, నాయీబ్రాహ్మణుల కనీస వేతనం రూ.25 వేలకు పెంచి, వారి జీవితాల్లో భరోసా కల్పించింది.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెష‌ల్ వీడియోను షేర్ చేసిన మేక‌ర్స్‌!

సమాజంలోని అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ, కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. గీత కార్మికులకు మద్యం షాపులు, బార్లలో 10 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు అందించి, మైనారిటీల సంక్షేమానికి కృషి చేసింది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించి, వారి ఆర్థిక భారాన్ని తగ్గించింది. అలాగే, పేదల ఆకలి తీర్చడానికి రూ.5కే భోజనం అందించే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించింది.

కూటమి ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అన్ని రంగాలకు విస్తరించింది. వడ్డెరలకు మైనింగ్ లీజులలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసింది. హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి అండగా నిలిచింది. ఈ పథకాలన్నీ కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధికి మాత్రమే కాకుండా, సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని నిరూపిస్తున్నాయి. ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగించి, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం సంకల్పించింది.

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెష‌ల్ వీడియోను షేర్ చేసిన మేక‌ర్స్‌!

Exit mobile version