YS Viveka Murder Case: వైస్ సునీతపై అనుమానం వ్యక్తం చేసిన వైస్ఆర్ సోదరి

వైస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ తాజాగా వైస్ అవినాష్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది

YS Viveka Murder Case: వైస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ తాజాగా వైస్ అవినాష్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. వైస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఇదిలా ఉండగా వైస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. వారం క్రితం ఆమెకు గుండెపోటు రావడంతో కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ రోజు అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని వైస్ఆర్ సోదరి విమల రెడ్డి పరామర్శించారు. బుధవారం ఆమె విశ్వభారతి ఆస్పత్రికి చేరుకొని అవినాష్ రెడ్డిని కలిసి మాట్లాడారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

వైస్ఆర్ సోదరి విమలమ్మ మాట్లాడుతూ… శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నట్టు తెలిపారు. వివేకా హత్య కేసులో సునీత ఎందుకు మాట మార్చిందో అర్ధం కావడం లేదన్నారు. తన తండ్రి హత్య కేసులో బంధువులకు ఎలాంటి సంబంధం లేదని మొదటి స్టేట్మెంట్ ఇచ్చిన ఆమె తరువాత కుటుంబీకులే తన తండ్రిని హత్య చేశారంటూ ఆరోపించిందని, అయితే సునీత ఎందుకు మాట మార్చిందో తెలియదని అన్నారు. సునీత వెనుక అనేక దుష్టశక్తులు ఉన్నాయని విమలమ్మ అభిప్రాయపడ్డారు. వైస్ అవినాష్ రెడ్డిని చిన్నప్పటి నుండి చూస్తున్నానని, అతని మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా అతని తల్లి తల్లడిల్లిపోతుందని వాపోయారు.

బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిజానికి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తల్లి అనారోగ్యం పాలవ్వడంతో అవినాష్ రెడ్డి విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. మరోవైపు సీబీఐ అవినాష్ కోసం ఎదురుచూస్తుంది. వీలైతే అతనిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తుంది.

Read More: YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతో అనుచరులు