Site icon HashtagU Telugu

Kodali Nani: కొడాలి నానీని మరొకసారి అసెంబ్లీ గడప తొక్కనీయోద్దు

Kodali Nani

Kodali Nani

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొడాలి నాని (Kodali Nani) పేరు బలంగా వినిపిస్తుంటుంది. టీడీపీ నుంచి వైసీపీ పార్టీ కండువా కప్పుకున్న నాని రాజకీయంగా ఉనికిని చాటుకుంటున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అనుభవించాడు. మరీ ముఖ్యంగా కొడాలి నాని సీఎం జగన్ కి ఆప్తుడు. అయితే నాని బూతుల నేతగా విపక్షాలు అభివర్ణిస్తూ ఉంటాయి. ప్రెస్ మీట్లు పెడుతూ విపక్షాలపై నాని వాడే భాష ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. ఆయన పదజాలంపై సీఎం జగన్ కూడా మండిపడ్డట్టు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని సీఎం జగన్ స్వయంగా కొడాలి నానికి సూచించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా కొడాలి నాని బూతులపై ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ హాట్ కామెంట్స్ చేశారు. కేవలం కొడాలి నాని బూతులని టార్గెట్ గా చేసుకుని ఆయన హాట్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ మాట్లాడుతూ… బూతులు మాట్లాడుతూ పేమస్ అయిన కొడాలి నానీని మరొక సారి అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయకుండా చేయాలన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా బూతులు మాట్లాడే నాయకులని జైల్లో పెడతామని సునీల్ హెచ్చరించారు. తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగను క్యాసినో, క్లబ్ డ్యాన్సర్లతో భంగం కలిగించాడని ధ్వజమెత్తారు. కొడాలి నాని బూతులతో యువతను నాశనం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడాలి నాని ఏపీలో ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతుందంటూ విమర్శించారు.

గుడివాడ నియోజకవర్గ సమస్యలపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ మాట్లాడుతూ కొడాలి నాని తీరుని ఎండగట్టారు.

Read More: MAA Notices: NTR విగ్రహ వివాదంలో కరాటే కల్యాణికి షోకాజ్ నోటీసులు