Sujana Chowdary entry into TDP? :
ఎన్నికల వేళ మళ్ళీ పాత కాపులు చంద్రబాబు చుట్టూ చేరుతున్నారు. ప్రజలతో నేరుగా సంబంధం లేని సుజనా చౌదరి (Sujana Chowdary), మాజీ మంత్రి నారాయణ, నాలుగు ఏళ్లుగా దూరంగా ఉన్న మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు సీన్లోకి వస్తున్నారు. అధికారపక్షంతో పోరాడిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సైలెంట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమ తదితరులు వెనక్కు వెళ్లిపోతున్నారు. మళ్ళీ సుజనా చౌదరి (Sujana Chowdary) తన టీంను యాక్టివ్ చేస్తున్నారు. పార్టీ కి ఆర్థిక వనరుగా ఎంటర్ అయిన ఆయన తెలుగుదేశం పార్టీ ని హోల్సేల్ గా రాజసభలో అమ్మేశారు. బీ జే పీ లో టీడీపీ ని విజవంతంగా విలీనం చేసిన ఆర్థిక వేత్త. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం అంటూ అమరావతి అంశాన్ని తీసుకొని గుంటూరు కేంద్రంగా మీటింగ్ పెట్టారు. ఒక బీజేపీ లీడర్ తో టీడీపీ లీడర్లు మీటింగ్ పెట్టటం పెద్ద చర్చకు దారితీస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న ముసుగు తొలగింది అనే సంకేతం బలంగా వెళ్ళింది. ఈ పరిణామం టీడీపీ కి క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే అంశంగా ఆ పార్టీలోని కొందరు ఆందోళన చెందుతున్నారు.
బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సుజన చౌదరి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి ఆదివారం వెళ్లారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీ నారాయణతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ కారుపై జరిగిన దాడిపై చర్చించారు.సత్యకుమార్‌పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి సహకరించాలని సుజనా చౌదరి (Sujana Chowdary) టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ నాయకులే సత్యకుమార్పై దాడి చేశారని, దీన్ని ఉమ్మడిగా ఎదిరించాల్సిన అవసరం ఉందని కోరారట. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తోన్న నిరసన దీక్షలకు బీజేపీ మద్దతు పలుకుతుంది.మద్దతును వైసీపీ సహించలేకపోతోందని, అందుకే గుండాలతో సత్యకుమార్‌పై దాడి చేయించిందని ఆరోపించారు. కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, ఈ ఓటును చీలనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికలకు వెళ్లాలని కోరారు.
ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. పొత్తుల విషయంలో బీజేపీ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలను పంపించలేదు. కానీ సుజనా ఎంట్రీ రాజకీయాల సమీకరణాలు మారుతున్నట్టే కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- పొత్తుల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును అడ్డుకోవడానికి 2014 తరహాలో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ-జనసేన, ఇతర పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడాలని సుజనా కోరిక. కానీ బీజేపీ అధిష్టానం అందుకు సిద్ధంగా లేదు. అందుకే టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సుజనా అడుగులు వేగంగా పడుతున్నాయి. గమనిస్తున్న బీజేపీ అధిష్టానం సుజనాకు సరైన జలక్ ఇవ్వడానికి సిద్ధం అయిందని తెలుస్తుంది. ఇలాంటి పరిణామం ఆర్థికంగా టీడీపీ కి లభించే అవకాశం ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో సుజనా వలన పార్టీ మీద చెడు ప్రభావం ప్రభావం పడనుందని క్యాడర్ ఆందోళన.
Also Read: KTR on AP: ఏపీ పై కేటీఆర్ కన్ను, విశాఖ స్టీల్, గన్నవరం పోర్ట్ టార్గెట్!