అధికారంలోకి వచ్చి ఫుల్ జోష్ లో ఉన్న చంద్రబాబు (Chandrababu) కు పార్టీ సీనియర్ నేత షాక్ ఇచ్చాడు. తాను అనుకున్న దగ్గర టికెట్ ఇవ్వలేదని , వేరే చోట ఇచ్చి తాను ఓడిపోయేలా చేసాడని చెప్పి..పార్టీ కి రాజీనామా చేసాడు. ఇది ఇప్పుడు పార్టీ లో తీవ్ర చర్చగా మారింది. పార్టీ స్థాపితమైనప్పటి నుంచి పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచిన సుగవాసి కుటుంబానికి చెందిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం (Sugavasi Bala Subramanyam) టీడీపీకి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. టికెట్ విషయంలో పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి తో ఉన్న ఆయన… ఇటీవల జరిగిన మహానాడు కు సైతం దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబు కు లేఖ రాసారు.
Tollywood : సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
రాజంపేట నియోజక వర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అధికారులు ఎవరూ రాకుండా.. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భయపెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మధ్య ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులతో కలిసి గత ఎన్నికల్లో తన ఓటమికి కుట్ర చేశారని వాపోయారు. ఎవరైతే ఎన్నికల్లో మోసం చేశారో వారి వివరాలు పార్టీ అధినాయకత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. నాలుగు దశాబ్దాల కాలంగా పార్టీలో పని చేసిన సుగవాసి.. నియోజకవర్గంలో పరిస్థితులు వివరించినా వారి పైన చర్యలు తీసుకోకపోవటం మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే టికెట్ తమకు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. సామాజికంగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో వైసిపి ఆయనతో చర్చల ప్రారంభించినట్లు సమాచారం. బాలసుబ్రమణ్యం కు రాయచోటి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు కూడా ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇదే కనుక నిజమైతే త్వరలోనే అయిన వైసిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.