పిఠాపురం (Pithapuram )..తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. మొన్నటి వరకు ఈ పేరు అంటే తెలియని వారు సైతం ఇప్పుడు పిఠాపురం గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. దానికి కారణం జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయడమే. మాములుగా ఓ సాధారణ సినిమా వ్యక్తి ఓ గ్రామానికి వస్తేనే సందడి సందడిగా ఉంటుంది. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు…ఎంతో పేరు , గుర్తింపు ఉన్న స్టార్ ఎమ్మెల్యే గా నిల్చోవడంతో అంత పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారన్న దగ్గరి నుండి గూగుల్ లో పిఠాపురం పేరు మారుమోగడం మొదలైంది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న దగ్గరి నుండి ప్రతి ఒక్కరూ పిఠాపురం గురించి అడగడం..పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్ల తో గెలుస్తారు..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం పిఠాపురం అంత సినీ స్టార్ల తో కళకలాడుతుంది. సినీ స్టార్స్ (Cine Stars) మాత్రమే కాదు బుల్లితెర స్టార్లు సైతం పవన్ కళ్యాణ్ కోసం గత 15 రోజులుగా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది , పృద్వి , గెటప్ శ్రీను , రైజింగ్ రాజు , దొరబాబు, వరుణ్ తేజ్ తదితరాలు ప్రచారం ముమ్మరంగా చేస్తుండగా..ఈరోజు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer ) కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్బంగా సుధీర్ మాట్లాడుతూ..చిన్నప్పటి నుండే చిరంజీవి , పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని..ఆ అభిమానంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు వచ్చానని..పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుతున్నామని చెప్పుకొచ్చాడు. మరోవైపు నాగబాబు సతీమణి పద్మజ సైతం నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరుగుతూ పవన్ విజయం కోసం కష్టపడుతుంది. ఇలా సినీ తరాల ప్రచారం తాలూకా వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
మేము @PawanKalyan గారి అభిమానులుగా ప్రచారం చేయటానికి ఇక్కడికి వచ్చాము..🥺❤️#VoteForGlass ✊🏼 pic.twitter.com/iledWMkPzY
— చందన🦋 (@JanaSenani__DHF) May 1, 2024
పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో మంగళవారం ప్రచారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు సతీమణి శ్రీమతి పద్మజా గారు, బీజేపీ కన్వీనర్ శ్రీ కృష్ణం రాజు గారి సతీమణి శ్రీమతి డాక్టర్ దివ్య గారు.#HelloAP_ByeByeYCP #VoteForGlass pic.twitter.com/iDFpxSPNlY
— JanaSena Party (@JanaSenaParty) May 1, 2024
Read Also : PM Kisan Rejection: పీఎం కిసాన్ నిధి యోజన దరఖాస్తు తిరస్కరణకు కారణాలివే..!