Visakhapatnam: రైలు కింద ఇరుక్కున్న యువతి.. కాపాడిన రైల్వే సిబ్బంది

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam)లోని దువ్వాడ స్టేషన్‌ (Duvvada railway station)లో ఓ విద్యార్థిని రైలు నుంచి దిగుతుండగా జారిపడి రైలుకు, ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కళ్లెదుట మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చిన విద్యార్థి పెద్దఎత్తున విలపించింది. అయితే అదృష్టవశాత్తూ రైలు వెంటనే ఆపి బాలికను రక్షించారు. విజ్ఞాన్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఓ బాలిక గుంటూరు నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్ రైలులో అన్నవరంలో ఎక్కింది. దువ్వాడ […]

Published By: HashtagU Telugu Desk
WOMEN STUCKS

Cropped

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam)లోని దువ్వాడ స్టేషన్‌ (Duvvada railway station)లో ఓ విద్యార్థిని రైలు నుంచి దిగుతుండగా జారిపడి రైలుకు, ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కళ్లెదుట మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చిన విద్యార్థి పెద్దఎత్తున విలపించింది. అయితే అదృష్టవశాత్తూ రైలు వెంటనే ఆపి బాలికను రక్షించారు.

విజ్ఞాన్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఓ బాలిక గుంటూరు నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్ రైలులో అన్నవరంలో ఎక్కింది. దువ్వాడ స్టేషన్‌ (Duvvada railway station)లో రైలు ఆగిన వెంటనే కదులుతున్న రైలు నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన ఆమె ఒక్కసారిగా జారిపడి రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. బాలిక భయంతో కేకలు వేయడంతో గందరగోళం నెలకొంది. రైలు వెంటనే ఆగినప్పటికీ రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి బాలికను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. రైల్వే సిబ్బంది వెంటనే రైలును ఆపి బాలికను రక్షించారు. చివరకు ఆమెను బయటకు తీసి కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. బాలికను రక్షించిన రైల్వే సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Also Read: CBI: సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఏపీ..

  Last Updated: 07 Dec 2022, 07:57 PM IST