Strange Weather : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వెరైటీగా ఉంది. ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తా ఆంధప్రదేశ్, యానాం వరకు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ఒక ద్రోణి వెళ్తోంది. సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో దక్షిణ ఒడిశా, పొరుగున ఉన్న తుఫాన్ ప్రసరణ ఎగువ ద్రోణితో కలిసిపోయింది. సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తెలంగాణ పొరుగు ప్రాంతాలపై తుఫాన్ సర్క్యులేషన్ ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు (శని, ఆదివారాల్లో) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
శుక్రవారం రోజు విభిన్న వాతావరణం(Strange Weather) కనిపించింది. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, గుమ్మలక్ష్మీపురంతో పాటూ ఇతర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ వేడి కనిపించింది. అయితే శుక్రవారం సాయంత్రం కల్లా ఆకాశం మేఘావృతమైంది. మెల్లగా చల్లగాలులు వీయగా.. ఉన్నట్టుండి వర్షం కురిసింది. భామిని, పార్వతీపురంలోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. కొద్ది రోజులుగా ఎండ వేడి, ఉక్కబోతకు అల్లాడిన ఆయా ప్రాంతవాసులు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. జీడి, మామిడికి ఈ వాన మేలు చేస్తుందని ఆయా రైతులు చెబుతున్నారు. అయితే చింతపండు, కొండచీపుర్లుకు మాత్రం నష్టం తప్పదని ఆయా ప్రాంత వాసులు వాపోతున్నారు.
Also Read : Group 1 Prelims : రేపటి నుంచే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు.. 17న ఎగ్జామ్
రాయలసీమలో భానుడు భగ్గుమంటున్నాడు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత కనిపిస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలో టెంపరేచర్స్ సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం కాస్త ఊరటనిస్తోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే టెంపరేచర్స్ 41 డిగ్రీలు దాటేస్తున్నాయి.