Andhra Council: నాడు మండలి ర‌ద్దు అన్నారు..నేడు వారికి అదే దిక్క‌వుతుందా…?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌న ప్ర‌భంజ‌నాన్ని కొన‌సాగింది. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు.

  • Written By:
  • Publish Date - November 12, 2021 / 08:00 AM IST

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌న ప్ర‌భంజ‌నాన్ని కొన‌సాగింది. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు. మ్యాజిగ్ ఫిగ‌ర్ కంటే అత్య‌ధిక స్థానాలు సాధించిన వైసీపీ అధినేత‌,సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌కు ఎదురులేద‌నే భావ‌న‌లో ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల త‌రువాత డిసెంబ‌ర్ 17 న అసెంబ్లీ స‌మావేశంలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.ఈ ప్ర‌క‌ట‌న‌తో రాజ‌ధాని ప్రాంతంలో ఒక్క‌సారిగా ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. పెద్ద ఎత్తున రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళ‌న‌లు మొద‌లు పెట్టారు. మ‌రోవైపు మూడు రాజ‌ధానుల బిల్లుతో పాటు,సీఆర్డీయే ర‌ద్దు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది.మండ‌లి ముందుకు వ‌చ్చింది.అయితే అస‌లు క‌థ అంతా ఇక్క‌డే న‌డిచింది. మండ‌లిలో అధికార వైసీపీకి పెద్ద‌గా మెజార్టీ లేక‌పోవ‌డంతో ఈ బిల్ల‌లు వీగిపోతాయ‌ని ముందుగానే అధికార పార్టీకి తెలిసిపోయింది. అయినా స‌రే ఎలాగైనా బిల్లుల‌ను ఆమోదించుకోవాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది.

నాడు మండలి ఛైర్మ‌న్‌గా ష‌రీఫ్‌,డిప్యూటీ ఛైర్మ‌న్ గా రెడ్డి సుబ్ర‌మ‌ణ్యం ఉన్నారు.వీరిద్ద‌రు టీడీపీ నుంచి ప‌ద‌వులు పొందిన వారే.ఇటు మండ‌లిలో టీడీపీకి 30 మంది స‌భ్యుల‌కుపైగానే బ‌లం ఉంది.మండ‌లి ముందుకు బిల్లులు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.కొన్ని బిల్లుల‌ను మండ‌లి ఆమోదించ‌గా…సీఆర్డీయే ర‌ద్దు బిల్లు,మూడు రాజ‌ధానుల బిల్లుపై మండ‌లిలో పెద్ద యుద్ధం జ‌రిగింది.15 మంది మంత్రులు మండ‌లిలోనే కూర్చున్నారు. ప్ర‌తిప‌క్షం,అధికార ప‌క్షం పెద్ద ఎత్తున మాట‌ల యద్ధం జ‌రిగింది.అయితే అర్థ‌రాత్రి వ‌ర‌కు మండ‌లిలోనే చ‌ర్చ జ‌రిగిన‌ప్ప‌టికి…మండ‌లి ఛైర్మ‌న్ త‌న విచ‌క్ష‌ణాధికారాన్ని ఉప‌యోగించారు. రూల్ 154 ప్ర‌కారం బిల్లును సెలెక్ట్ క‌మిటీకి పంపుతూ ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు.దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఛైర్మ‌న్ పై ఆగ్ర‌హాంతో ఊగిపోయారు.ఇటు రాజ‌ధాని రైతులు మాత్రం మండ‌లి ఛైర్మ‌న్ ష‌రీఫ్‌కి పాలాభిషేకం చేశారు.

ఆ త‌రువాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మూడు రాజ‌ధానుల బిల్లులు ముందుకు వెళ్ల‌లేదు.దీంతో సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మండలి ర‌ద్దు చేస్తున్న‌ట్లు అసెంబ్లీలో తీర్మాణం చేసి ఆమోదించారు.ఈ తీర్మాణాన్ని కేంద్రానికి కూడా పంపారు.అయితే నాడు మండ‌లి వ‌ద్ద‌న్న వైసీపీ ప్ర‌భుత్వం నేడు అదే దిక్క‌వుతుంది. 2019 ఎన్నిక‌ల ముందు చాలా మంది ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగ‌ప‌డిన వారందరికి ఎమ్మెల్సీలు ఇస్తామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు.అయితే అసెంబ్లీలో మండ‌లి ర‌ద్దు చేస్తాన‌న‌డంతో వారంతో అయోమ‌యంలో ప‌డిపోయారు.కానీ ఆ మండ‌లి ర‌ద్దు కాక‌పోవ‌డంతో ఖాళీ అవుతున్నా స్థానాల‌కు త‌న పార్టీ వారికి సీఎం జ‌గ‌న్ అవ‌కాశ‌మిస్తున్నారు. రానున్న రోజుల్లో మ‌రికొంత మంది టీడీపీ స‌భ్యుల ప‌ద‌వీకాలం పూర్తి అయితే మెజార్టీ స‌భ్యులంతా వైసీపీ వారే అవుతారు.అప్పుడు అయినా మూడు రాజ‌ధానుల బిల్లు ఆమోదించుకోవ‌చ్చు. ఏది ఏమైన‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ ఆవేశ‌పూరితంగా మండ‌లిపై ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికి ఇప్పుడు వారికి ఇదే ప‌ద‌వుల‌ను తెచ్చిపెడుతుంద‌నే చెప్పాలి.