డ్ర‌గ్స్ వెనుక తాడేప‌ల్లి డాన్ ఎవ‌రు? తాలిబ‌న్ లింకుల‌పై టీడీపీ అనుమానం

డ్ర‌గ్స్ వ్య‌‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. గుజ‌రాత్ రాష్రంలోని ముంద్ర పోర్ట్ నుంచి క్రిష్ణ‌ప‌ట్నం పోర్ట్.. అక్క‌‌డి నుంచి విజ‌య‌వాడ‌కు డ‌గ్స్ స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. ఆ విష‌యాన్ని నిఘా వ‌ర్గాలే బ‌య‌ట‌పెట్టాయి. సుమారు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజ‌రాత్ లో ప‌‌ట్టుబ‌డింది.

  • Written By:
  • Publish Date - September 24, 2021 / 02:34 PM IST

డ్ర‌గ్స్ వ్య‌‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. గుజ‌రాత్ రాష్రంలోని ముంద్ర పోర్ట్ నుంచి క్రిష్ణ‌ప‌ట్నం పోర్ట్.. అక్క‌‌డి నుంచి విజ‌య‌వాడ‌కు డ‌గ్స్ స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. ఆ విష‌యాన్ని నిఘా వ‌ర్గాలే బ‌య‌ట‌పెట్టాయి. సుమారు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజ‌రాత్ లో ప‌‌ట్టుబ‌డింది. దానికి సంబంధించిన మూలాలు విజ‌య‌వాడ‌లో ఉన్నాయి. దీంతో రాజ‌కీయ రంగు పులుముకుంది.
కాకినాడ‌కు చెందిన సుధాక‌ర్ అనే వ్య‌క్తిని నిఘా వ‌ర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాలో అత‌ని ప్ర‌మేయం ఉంద‌ని ప్రాథమికంగా గుర్తించారు. అత‌ను వైసీపీ కాకినాడ విభాగానికి చెందిన నాయ‌కునిగా టీడీపీ చెబుతోంది. సుమారు 21వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ కు కేంద్రం తాడేప‌ల్లి సీఎం ఇంటి పరిస‌రాలు ఉన్నాయ‌ని బుద్ధా వెంక‌న్న తీవ్ర‌మైన ఆరోప‌ణ‌ల‌కు దిగారు. రెండున్న‌రేళ్ల కాలంలో 72వేల కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్, గంజాయి లావాదేవీలు జ‌రిగాయ‌ని, అవిన్నీ సీఎం ఇంటికి తెలిసే జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీని వెనుక ఉన్న బిగ్ డాన్ బ‌య‌ట‌కు రావాల‌ని డిమాండ్ చేశారు. అందుకోసం సీబీఐకి ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని అప్ప‌గించాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాపై టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు వైసీపీ కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. టీడీపీ హ‌యాంలోనే డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం న‌డిచింద‌ని వైసీపీ నేత‌లు ప్ర‌తిస్పందిస్తున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో కాల్ మ‌నీ, సెక్స్ రాకెట్లతో పాటు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం న‌డిచింద‌ని టీడీపీకి కౌంట‌ర్ ఇస్తున్నారు వైసీపీ నేత‌లు. కానీ, అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు మాత్రం సీరియ‌స్ గా క‌నిపించ‌డంలేదు.
సాధార‌ణంగా ఇటీవ‌ల పెద్ద రాకెట్ బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడు అంటు కేంద్ర ఇటు రాష్ట్రా నిఘా, ద‌ర్యాప్తు సంస్థ‌లు సీరియ‌స్ గా తీసుకుంటాయి. వీలున్నంత త్వ‌ర‌గా నిందితుల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రుగుతుంది. కానీ,రాష్ట్ర , కేంద్ర నిఘావ‌ర్గాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డంలేదు. పైగా ముంద్రా పోర్ట్ వ‌ద్ద దొరికిన డ్ర‌గ్స్ కు సంబంధించిన అడ్ర‌స్ విజ‌య‌వాడ‌గా పేర్కొన్నారు. దానికి సంబంధించిన పూర్వ ప‌రాలు ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. నింపాదిగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నాయి. సీఎం ఇంటి నుంచే మొత్తం వ్య‌వహారం న‌డుస్తోంద‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. తాడేప‌ల్లికి తాలిబ‌న్ల‌కు సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి ఇప్ప‌ట్లో ఫుల్ స్టాప్ ప‌డుతుందా? లేక కేంద్ర నిఘా వ‌ర్గాలు క్లారిటీ ఇస్తాయా? అనే దానిపై ఈ మొత్తం వ్య‌వ‌హారం ఆధార ప‌డి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు ఎక్క‌డ వ‌ర‌కు వెళ‌తాయో చూడాలి.