Handri Neeva : ఏపీ హంద్రీనీవాపై తెలంగాణ ఫిర్యాదు

హంద్రీనీవా-సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ పిలిచిన టెండ‌ర్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా న‌ది నిర్వాహ‌ణ‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

  • Written By:
  • Publish Date - November 16, 2021 / 03:23 PM IST

హంద్రీనీవా-సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ పిలిచిన టెండ‌ర్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా న‌ది నిర్వాహ‌ణ‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది. AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనలను ఉల్లంఘించేవిగా టెండ‌ర్లు ఉన్నాయ‌ని ఆరోపించింది. ఆ మేర‌కు రాత‌పూర్వ‌కంగా తెలంగాణ ఇరిగేష‌న్ ఇంజ‌నీర్ చీఫ్ ముర‌ళీధ‌ర్ ఫిర్యాదు చేశాడు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య కృష్ణా న‌ది నీటిని వాడుకునే క్ర‌మంలో ఏర్ప‌డి వివాదాల ప‌రిష్కారం కోసం కేంద్రం గెజిట్ ఇచ్చింది. దాని ప్ర‌కారం కృష్ణా న‌ది నిర్వాహ‌ణ బోర్డు స‌ర్వ అధికారాలు ఉన్నాయి. అందుకే, కేఆర్ఎంబీ చైర్మ‌న్ కు తెలంగాణ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు.

Also Read : మ‌ర్రికి మొండి చెయ్యి చూపిన జ‌గ‌న్‌..పేట వైసీపీలో ముస‌లం

హంద్రీనీవా..సుజ‌ల‌స్ర‌వంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ) ప్ర‌ధాన కాలువను 3,850 క్యూసెక్కుల నుంచి 63,000 క్యూసెక్కులకు పెంచేందుకు ఆంధ్రా ప్రభుత్వం టెండర్లు పిలిచింద‌ని తెలంగాణ చేసిన ఆరోప‌ణ‌. అలాగే, ఇది KWDT-I నిబంధనలకు వ్యతిరేకంగా తుంగభద్ర సబ్ బేసిన్‌లోకి నీటిని ఎత్తిపోస్తుంద‌ని లేఖ‌లో తెలంగాణ పేర్కొంది. “KWDT-II కంటే ముందు AP తన మిగులు నీటి ఆధారిత ప్రాజెక్టులకు ఆధారపడదగిన నీటి కోసం అభ్యర్థించలేదని రాసిన లేఖ ఇప్పుడు ఇరు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో నీటి వివాదంగా మారింది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌రువాత గోదావ‌రి,కృష్ణాన‌దుల నీటి వాడ‌కం మీద ప‌లు సంద‌ర్భాల్లో వివాదానికి దిగాయి. విభ‌జ‌న చ‌ట్టాన్ని ధిక్కిరిస్తూ ఇరు రాష్ట్రాలు ప‌లుప్రాజెక్టుల‌ను చేప‌ట్టాయి. కానీ, ఎవ‌రి వాద‌న వాళ్లు చేస్తూ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రాజెక్టుల‌ను నిర్మిస్తున్నామ‌ని చెబుతున్నాయి. అందుకే , కేంద్రం రెండు న‌దుల‌పై బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రివాళ్లే ప్రాజెక్టులకు టెండ‌ర్ల‌ను పిలుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Also Read : షా చాటు జ‌గ‌న్‌.!