Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌పై రాళ్ల దాడి.. తప్పిన పెనుప్రమాదం..!

ఏపీలో రాజకీయం రాజుకుంది. ప్రచారంలో పాల్గొన్న నేతలపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై దాడి జరిగిన ఘటన నుంచి తేరుకోకముందే.. ఇప్పుడు జనసేన పార్టీ (Janasena Party) అధినేత, పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై నేడు దాడి జరిగింది. అయితే.. అప్రమత్తమైన పవన్‌ కళ్యాణ్‌ వెంటనే పక్కకు తప్పుకోవడంతో.. ఆయనకు తగలాల్సిన రాయి పక్కకు […]

Published By: HashtagU Telugu Desk
Pavan Kalyan

Pavan Kalyan

ఏపీలో రాజకీయం రాజుకుంది. ప్రచారంలో పాల్గొన్న నేతలపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై దాడి జరిగిన ఘటన నుంచి తేరుకోకముందే.. ఇప్పుడు జనసేన పార్టీ (Janasena Party) అధినేత, పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై నేడు దాడి జరిగింది. అయితే.. అప్రమత్తమైన పవన్‌ కళ్యాణ్‌ వెంటనే పక్కకు తప్పుకోవడంతో.. ఆయనకు తగలాల్సిన రాయి పక్కకు పడిపోయింది. దీంతో జనసైనికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో భాగంగా వారాహి యాత్ర (Varahi Yatra) పేరిట సభలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈనేపథ్యంలోనే నేడు గుంటూరు జిల్లాలోని తెనాలి పవన్‌ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే.. వారాహి యాత్రలో గుర్తు తెలియని దుండగుడు పవన్‌ కళ్యాణ్‌పై రాయి విసిరాడు.. అయితే.. ఆ రాయి పవన్‌ కళ్యాణ్‌కు తగలకుండా పక్కన పడింది. ఇది చూసిన జనసైనికులు కోపోద్రిక్తులై.. ఆ దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. నిన్న సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే జగన్‌పై జరిగిన దాడి వెనుక ఉన్నది తెలుసుకునేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు కమిషనర్‌. ఎస్పీ స్థాయి అధికారరి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు సీపీ. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు… అజిత్‌సింగ్‌ నగర్‌లో 3 సెల్‌ఫోన్‌ టవర్స్‌ నుంచి డేటా స్వాధీనం చేసుకున్నాయి.. దాదాపు 20 వేల సెల్‌ఫోన్లు ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
Read Also : Mission Bhagiratha : నీటి కొరత లేదు.. ఆ వార్తల్లో నిజం లేదు..!

  Last Updated: 14 Apr 2024, 07:25 PM IST