Stone Attack on Jagan : నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రస్తుతం నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Cm Jagan (4)

Cm Jagan (4)

ఏపీ సీఎం జగన్ ఫై జరిగిన రాయి దాడి (Stone Attack on Jagan) ఫై పోలీసులు (Police) దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ ఘటన కు సంబదించిన నలుగుర్ని అదుపులోకి తీసుకొని (police arrested four people) విచారిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత కొద్దీ రోజులుగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా శనివారం విజయవాడలో యాత్ర చేస్తుండగా.. జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తి బలంగా రాయి విసరడంతో జగన్ కనుబొమ్మకు తగిలి గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. వెంటనే జగన్‌కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర ముఖ్య‌మంత్రి కొనసాగించారు. అనంతరం వైద్యుల సలహామేరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి తగిలిన గాయానికి చికిత్స తీసుకున్నారు. నిన్న రిస్ట్ తీసుకున్న జగన్..ఈరోజు తిరిగి తన యాత్రను మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా ఈ దాడిఫై అజిత్‌ సింగ్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు కట్టిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఓ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. అదుపులో ఉన్న నిందితుల్లో రౌడీషీటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలోని అన్ని చోట్ల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన టైంలో కరెంటు లేకపోవడం దర్యాప్తుకు ప్రధాన అడ్డంకిగా మారిందంటున్నారు పోలీసులు. రోడ్‌షో జరిగిన ప్రాంతంలో ఉన్న పాఠశాల నుంచే రాయి విసిరినట్టు నిర్దారించిన పోలీసులు అక్కడ ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. క్యాట్‌బాల్ ఉపయోగించారా లేదా ఎయిర్‌ గన్ వాడారా అనేది పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటె దాడి నేపథ్యంలో నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. సీఎం జగన్ కు, జనానికి మధ్య బారికేడ్లు ఉండాలని భద్రతా సిబ్బందికి నిఘా వర్గాలు సూచించాయి. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలని.. వీలైనంత వరకూ బస్ లో కూర్చునే రోడ్ షోలు నిర్వహించాలని సూచించాయి. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్ధం విధించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరీ అవసరమైతేనే జగన్ బస్సుకు దగ్గరగా నేతలు, కార్యకర్తలను అనుమతించాలని చెప్పింది.

Read Also : Raghurama Krishna : మరో సానుభూతి కోసం జగన్ తెరతీసిన నాటకం : రఘురామకృష్ణ

  Last Updated: 15 Apr 2024, 10:56 AM IST