Stone Attack On Chandrababu : ప్రజాగళం సభలో రాళ్లు విసిరిన దుండగులు

గాజువాక లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు

Published By: HashtagU Telugu Desk
Cbn Stone

Cbn Stone

ఏపీలో పార్టీల అభ్యర్థులకు ఓట్ల(Votes) కంటే ముందు రాళ్లు (Stones) పడుతున్నాయి. నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) ఫై విజయవాడ లో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఆయన కనుబొమ్మకు గాయం అయ్యింది. ఈ ఘటన గురించి దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటుండగా..ఈరోజు ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసారు. కొద్దీ సేపటి క్రితం తెనాలి లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై రాయి విసరగా..అదృష్టం కొద్దీ అది పక్కకు పడడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. వెంటనే ఆ రాయి విసిరిన వ్యక్తిని జనసేన శ్రేణులు పట్టుకొని , చితకబాది పోలీసులకు అప్పగించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటన గురించి అంత మాట్లాడుకుంటుండగానే..గాజువాక లో చంద్రబాబు (Chandrababu) నిర్వహించిన ప్రజాగళం (Prajagalam) సభలో కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు. ఈ రాళ్లు సభలో ఎవరికి తగలలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాగా రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఈ దాడి వెనుక గల కారణాలేంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటన ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కావాలనే కొంతమంది గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ రాళ్లు వేస్తున్నారు. నిన్న విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా అని హెచ్చరించారు. పోలీసుల వైఫల్యంతోనే ఈఘటన జరిగిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దీ సేపటి క్రితం తెనాలిలో పవన్‌ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారు. ఇక ఇప్పుడు నాపై వేస్తున్నారు. గత ఎన్నికలప్పుడు నాపై ఇలాగే రాళ్లు వేశారు అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌పై రాళ్ల దాడి.. తప్పిన పెనుప్రమాదం..!

  Last Updated: 14 Apr 2024, 08:11 PM IST