Site icon HashtagU Telugu

AP : వైసీపీ మంత్రుల కార్లపై రాళ్ల దాడి…!!

Ysrcp

Ysrcp

వైజాగ్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రులు, రోజా, జోగి రమేశ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై రాళ్ల దాడి జరిగింది. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో కార్లపై రాళ్లు, కర్రలతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న సమయంలో…మంత్రులు రోజా, జోగిరమేశ్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.