Stone Attack on Jagan : డబ్బులు ఇవ్వలేదు కాబట్టే..జగన్ ఫై దాడి చేసారా..?

డబ్బులు ఇవ్వలేదనే కోపం తోనే వారు రాళ్లు విసిరినట్లు ఉందని..కానీ అది జగన్ ఫై వేద్దామని కాదు ..రోడ్ షో లో వేద్దామని వేశారు

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 12:09 PM IST

ఏపీలో ఎన్నికల (AP Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ (YCP) తీరు ఫై అంత విమర్శలు చేస్తున్నారు. అధికారం కోసం ఇలాంటివి చేయాలా అని మాట్లాడుకుంటున్నారు. మంచితో ప్రజలను గెలవాలని కానీ భయపెట్టి..సానుభూతితో ఓట్లు దండుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడి కత్తితో దాడి..ఇప్పుడు గులకరాయి తో దాడి..ఇలా దాడులతో ఎంతకాలం అని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నాల్గు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ ఫై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ముమ్మాటికీ టీడీపీ వారే చేయించారని వైసీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అటు టీడీపీ సైతం ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది. ఈ దాడి ఫై సిట్ అధికారులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా..అందులో ఓ మైనర్ యువకుడు సతీష్..ఈ దాడి చేసేంది తానే అని ఒప్పుకున్నాడు. కానీ ఎందుకు చేసాడు..? ఎవరైనా చేయమని చెప్పారా..? అని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటె అదుపులోకి తీసుకున్న యువకుల తల్లులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఇంట్లో ఉన్న మమ్మల్ని 200 రూపాయలు ఇస్తామని వైసీపీ నేతలు తీసుకెళ్లారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు అడిగితే సమాధానం చెప్పలేదు..అసలు డబ్బులు ఇస్తామని చెప్పకుంటే మీము , మా పిల్లలు ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా..ఎందుకు డబ్బులు ఇస్తామని తీసుకెళ్లాలని..వెళ్ళాక డబ్బులు ఇవ్వమని ఎందుకు చెప్పాలి..? ఇలా చేస్తే కోపం రాదా..? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. వీరే కాదు మగవారు సైతం తమకు మద్యం , డబ్బు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు..తీరా అక్కడికి వెళ్ళాకా మద్యం పోశారు కానీ డబ్బు ఇవ్వలేదని చెపుతున్నారు. ప్రస్తుతం వీరి మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. వీరి మాటలు విన్న తర్వాత డబ్బులు ఇవ్వలేదనే కోపం తోనే వారు రాళ్లు విసిరినట్లు ఉందని..కానీ అది జగన్ ఫై వేద్దామని కాదు ..రోడ్ షో లో వేద్దామని వేశారు..కానీ అది జగన్ కు తగిలినట్లుందని అనిపిస్తుందని అంత భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి వైసీపీ నేతలు చేస్తున్న అత్యత్సం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Read Also : Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ