Site icon HashtagU Telugu

AP Govt : చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

Record In AP History

Record In AP History

ఆంధ్రప్రదేశ్‌లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దసరా (Dasara) పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. 2014-19 మధ్య రూ.5 కోట్ల లోపు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లు ఉపశమనం పొందనున్నారు. పలు అభివృద్ధి పనుల్లో నిమగ్నమైన ఈ కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులు ఆలస్యమవడం వల్ల ఆర్థిక భారంతో సతమతమయ్యారు.

Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!

ప్రభుత్వ వర్గాల ప్రకారం ఈ నిర్ణయంతో సుమారు రూ. 400 కోట్ల మేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా చిన్న కాంట్రాక్టర్లు తమ పెండింగ్ అప్పులు తీర్చుకోవడం, కొత్త పనులు చేపట్టడం సులభం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో చిన్న కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోవడంతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ చర్యతో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం చలామణీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో ఆర్థిక శాఖ ఈ చెల్లింపుల ప్రక్రియ చేపట్టిందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే డబ్బులు కాంట్రాక్టర్ల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు తెలిపారు. చిన్న కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా అభివృద్ధి పనులకు వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య కాంట్రాక్టర్లలో నమ్మకాన్ని పెంచడమే కాకుండా, ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలుకు కూడా తోడ్పడనుందని విశ్లేషకుల అభిప్రాయం.

Exit mobile version