Site icon HashtagU Telugu

AP Elections 2024; టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..!

AP Elections 2024

AP Elections 2024

AP Elections 2024; ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ ఏదైనా నిబంధనలను ఉల్లంగిస్తే ఉపేక్షించడం లేదు. అక్కడ ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీ పార్టీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తప్పు చేస్తే నోటీసులు జారీ చేస్తుంది. ఒక రకంగా ఇది హర్షించదగ్గ పరిణామమే. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు పంపింది.

We’re now on WhatsAppClick to Join

వైసీపీ నేతలు టీడీపీ నేత లోకేష్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం అధికారులు స్పందించి టీడీపీ పార్టీకి నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పై వ్యతిరేకంగా ఒక పాటను రూపొందించి దానిని సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా ప్రజల్లోకి పంపుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది.

ఇటీవల సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగిన విషయం విదితమే. అయితే ఆ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, మరియు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో పరిశీలించిన ఎన్నికల కమిషన్ చంద్రబాబుతో సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Apoorva Srinivasan : ఏడడుగులు వేసేసిన తెలుగు నటి.. ముద్దు ఫొటోలతో..